Monday, December 1, 2014

1993లో చనిపోయిన ఫాదర్ క్రెస్పి యే హిట్లరా...?

హిట్లర్ ఎలా చనిపోయాడు? ఇది ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోతుంది.


హిట్లర్ ఎలా చనిపోయాడన్న విషయంపై చాలా కాలం వరకు చర్చోపచర్చలు నడిచాయి. అసలు ఆయన అందరూ చెబుతున్నట్లు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అన్నది ఒక అనుమానం. ఆత్మహత్య చేసుకుంటే విషం మింగి చనిపోయాడా లేక తుపాకితో కాల్చుకుని చనిపోయాడా అన్నది మరో అనుమానం.

హిట్లర్ చనిపోయాక మొదటగా అక్కడికి చేరుకున్న సోవియట్ సేనలకు హిట్లర్ శవం దొరకలేదు, దంతాలు మాత్రమే దొరికాయి. దానితో హిట్లర్ అసలు చనిపోలేదని, పశ్చిమ రాజ్యాల వైపుకి పారిపోయి వారి దగ్గర రక్షణ పొంది ఉండవచ్చని సోవియట్ నేతలు అనుమానించారు. వారి అనుమానమే హిట్లర్ మరణం చుట్టూ గోప్యత అల్లుకోవడానికి కారణం అయింది.

ఇంతకీ హిట్లర్ నిజంగా చనిపోయారా లేక పారిపోయారా అన్నది ఇప్పటికీ నిర్ధారణగా తెలియదు. పశ్చిమ రాజ్యాలు, సోవియట్ యూనియన్ లు హిట్లర్ చనిపోయాడన్న ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ భౌతిక రుజువులు మాత్రం ఇప్పటివరకు లేవు. ఇది అందరికీ తెలిసిన మిస్టరీ.

ఇప్పుడు అసలు మిస్టరీ.

గత 10 సంవత్సరాలుగా కొన్ని కధలు బయటపడుతున్నాయి. హిట్లర్ తన ఓటమి నిర్ధారణ అయిన వెంటనే జర్మనీ నుండి తప్పించుకుని దక్షిణ అమెరికాకు పారిపోయి, అక్కడ ఫాదర్ క్రెస్పి గా తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టేడట. కానీ ఫాదర్ క్రెస్పి యే హిట్లర్ అనే రుజువులు లేవు?..... ఒక కధనం తప్ప!

ఈక్వడార్ దేశంలోని నగరమైన క్విన్సీ(Cuence)మతాధికారి ఫాదర్ క్రెప్సి తన 90 వ ఏట, 1993 లో చనిపోయేరు. ఆయన అంత్యక్రియలకు 2000 మంది హాజరయ్యేరు. ఆయన అంత్యక్రియలు ఒక దేశ రాజుకు ఎలా చేస్తారో అంతే సమానంగా జరిగింది. ఆయనను పూడ్చిపెట్టిన సమాధి తెల్ల పాలరాయితో చేయబడింది. ఆయన సమాధిని వారానికి ఒకసారి శుభ్రం చేస్తూ, పూవులతో నిరంతరం అలంకరిస్తారట. వీటన్నిటికీ ఖర్చుచేసేది ఆయన్ను ఆరాధించే అనామక వ్యక్తులు.


ఆయన చనిపోయిన తరువాత ఆయన గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కనుగొన్నారు. కొన్ని మిల్లియన్ డాలర్ల విలువ గల కళాత్మక చిత్రాలను ఆయన వదిలి వెళ్ళేరు. స్థానిక జర్మన్లు మరియు ఇతరులు ఆ కళాత్మక చిత్రాలు ఎడాల్ఫ్ హిట్లర్ యొక్క వ్యక్తిగత సేకరణకు చెందినవని తెలిపేరు. హిట్లర్ కళాత్మక చిత్రాలు సేకరించేవారని, కానీ ఆయన సేకరించిన కళాత్మక చిత్రాలు యుద్దం ముగిసిన తరువాత కనబడకుండా పోయేయట. 1993, మే-16 న (ఫాదర్ క్రెస్పి చనిపోయిన కొన్ని రోజుల తరువాత) రెండు సరకు రవాణా జెట్ విమానాలు ఫాదర్ క్రెస్పి వదిలి వెళ్ళిన కళాత్మక చిత్రాలను తీసుకుని వెళ్ళేయట. వాటిని మళ్ళీ ఎవరూ చూడలేదట.

ఫాదర్ క్రెస్పి చనిపోవడానికి ముందు రోజు యూరోపియన్లు చాలామంది ఆ నగరానికి వచ్చేరని, అంత్యక్రియలలో పాల్గొన్న వారిలో చాలామంది జెర్మనీ దేశస్తులని, అందులో కొంతమంది సాయుధ రక్షణదళంతో వచ్చేరని క్విన్సీ నగర పోలీస్ చీఫ్ తన నివేదికలో తెలిపేరు.

చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తిగా పిలవబడే హిట్లర్ చట్టం నుండి తప్పించుకోవటం, దేవుని మనిషి అనే ముసుగులో 40 సంవత్సరాలు గడపడం సాధ్యమేనా? ఎలా సాధ్య మయింది?

యుద్ధం ముగిసే సమయంలో( అంటే హిట్లర్, తను ఓడిపోతున్నట్లు తెలుసుకున్నప్పుడు) హిట్లర్ తన మెడికల్ రికార్డులను నాశనం చేసేడు. హిట్లర్ వ్యక్తిగత వైద్య బృందములో, ఒకరు తప్ప మిగిలినవారందరు అదృశ్యమయ్యేరు. ఆ ఒక్క డాక్టర్ కూడా హిట్లర్ వ్యక్తిగత వైద్య బ్రుందములోని దంత వైద్యుని సహాయకురాలు. రష్యన్ సైన్యం ఆ దంత వైద్యుని సహాయకురాలుని పట్టుకుని, ఆమె చేత హిట్లర్ దంతాల పటం గీయించి, హిట్లర్ చనిపోయిన ప్రదేశంలో దొరికిన దంతాలతో పోల్చి చూసి, చనిపోయింది హిట్లరేనని తెలిపేరు.

అప్పటి రష్యా పరిపాలకుడు స్టాలిన్ తన సైనిక దళాలు చెప్పినదానిని అంగీకరించలేదు.కానీ, హిట్లర్ రష్యా సైనికుల దగ్గర నుండి తప్పించుకున్నాడని ప్రపంచానికి తెలిస్తే తనకు అవమానమని, సైనిక దళాలు చెప్పింది నిజమేనని, హిట్లర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయేడని, చనిపోయింది హిట్లరే నని ద్రువీకరించడానికి కావలసిన ఆధారం దొరికిందని ప్రపంచానికి తెలియజేసేరు.

1981 లో రిటైర్డ్ అమెరికా ఆర్మీ కర్నల్ వెండెల్ స్టీఫెన్స్ ఈక్వడార్ యాత్రకు వెళ్ళేరు. యాత్రలో భాగంగా క్విన్సీ నగర చర్చ్ కు వెళ్ళి అక్కడ మతాధికారి ఫాదర్ క్రెప్సి ని కలిసేరు. ఫాదర్ క్రెప్సి ని చూసిన వెంటనే వెండెల్ స్టీఫెన్స్ ఫాదర్ క్రెప్సి ని హిట్లర్ గా గుర్తించేరు. ఫాదర్ క్రెప్సి యే హిట్లర్ అని అక్కడున్న ప్రజలతో చెప్పేడు. కానీ అక్కడి ప్రజలు ఆయన చెప్పింది నమ్మలేదు. వెండెల్ స్టీఫెన్స్ మరికొన్ని హిట్లర్ ఫోటోలతో ఫాదర్ క్రెప్సి ని పోల్చి చూసి ఫాదర్ క్రెప్సి యే హిట్లర్ అని నిర్ధారణకు వచ్చి, అదే విషయాన్ని అక్కడి ప్రజలకు చెబుతూ, ఫాదర్ క్రెప్సి ఈక్వడార్ కొండ ప్రాంతములో గల తన ఇంట్లో దాచుకున్న వెల కట్టలేని కళాత్మక చిత్రాల గురించి కూడా చెప్పేడు. కానీ ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు.

ఫాదర్ క్రెప్సి ఎవరు?

ఫాదర్ క్రెప్సి నేపథ్యం కూడా మర్మం గానే ఉన్నది. ఈయన ఇటలీ/ఆస్ట్రేలియా కుటుంబాలకు చెందినవాడని, ఉత్తర ఇటలీలో నివసించేవాడని తెలిపేరు. 1943 పతనం తరువాత వాటికన్ నగరం కు వచ్చేడు. అక్కడ సెమినరీ(శిక్షణ సంస్థ)లో చేరి శిష్యరికం చేసేరట. ఆ తరువాత ఆయన్ను మతాధికారిగా నియమించేరట. ఇవన్నీ నాలుగు గోడల మధ్య జరిగిందట(అప్పుడు అలా జరగేది కాదు, ఆ తరువాత ఎప్పుడూ అలా జరగలేదు). ఈయన ఎప్పుడూ వాటికన్ నగరం వదిలి రాలేదు. దౌత్యాధికారము ఇవ్వబడిన ఒకే ఒక నగరము ఇదే. వాటికన్ పూర్వకాలపు దస్తావేజులు మరియు కళాత్మక చిత్రాల సంరక్షకుడుగా నియమించబడ్డారట. ఈయన పని ఏమిటంటే బిల్లియన్ల డాలర్ల విలువ కలిగిన కళాత్మక చిత్రాల జాబితా తయారుచేయడం. ఈయన వాటికన్ లో ఉన్నప్పుడు, ఒకప్పుడు వాటికన్ లో నాజీ జర్మన్లచే కొల్లగొట్టబడ్డ కళాత్మక చిత్రాలు మళ్ళీ అక్కడకు వచ్చినై.


1956లో ఫాదర్ క్రెప్సి ని ఈక్వడార్ దేశంలోని క్విన్సీ నగరానికి మతాధికారిగా నియమించి అక్కడికి పంపించేరు. ఈ నగరం నాజీ జెర్మన్లు దాక్కునే నగరంగా అందరికీ తెలుసు. జర్మనీ నుండి తప్పించుకు వెళ్ళిన జెర్మన్ ఉన్నత అధికారి మార్టిన్ బోర్మాన్ మరియూ ఇతర జెర్మన్ ఉన్నత అధికారులు దాక్కున్న ప్రదేశం ఇది. ఇక్కడ ఫాదర్ క్రెప్సి మతాధికారిగా ఏకాంత జీవితం గడుపుతూ తన క్రింద పనిచేసిన వారికి డబ్బు ఇస్తూ, అక్కడి గ్రామ ప్రజలకు, తన గురించి బయటి ప్రపంచానికి చెప్పకుండా ఉండేదుకు డబ్బు పంచేరట. జెర్మనీకి చెందిన వారే ఈయనను చూడటానికి ఎప్పుడూ వస్తూ ఉండేవారని అక్కడి ప్రజలు చెబుతున్నారు .

2 comments:


 1. మీరు భలే భలే ఇంటరెస్టింగ్ విషయాలు పట్టి పోష్టు చేస్తారండి !!

  I see you are very consistent in sharing such wonderful and interesting episodes for a long time!

  Its the patience for blogging such info makes you to go ahead in that passionate way I suppose

  My hearty congratulations for such long tenure of 5 years+ in th telugu blogging world!

  Keep it up !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete