Friday, November 28, 2014

ఈ సంపన్నవ్యాపరవేత్త తన స్వగ్రామం ప్రజలకు నమ్మలేని సహాయం చేసేడు....ఫోటోలు

అంత నమ్మలేని సహాయం ఏముంటుంది? అని మీరు అనుకుంటునారని నేను ఊహించుకోగలను.చదివిన తరువాత మీకే తెలుస్తుంది.

చైనాలోని క్సియాంగ్ కెంగ్ అనే గ్రామంలో పుట్టిన క్సియాంగ్ సుయ్ హువా, తన చిన్నతనంలో ఆ గ్రామ ప్రజలు అతనికి ఎంత సహాయపడ్డారో మరిచిపోలేదు. అతని తిండికి, గుడ్డకు మరియు చదువుకు వారి చేసిన సహాయం, అతన్ని అతిపెద్ద వ్యాపరవేత్తగా చేసి, అత్యంత సంపన్నుడిగా మార్చింది. అలాంటి గ్రామ ప్రజలకు తాను చేయవలసింది ఎంతో ఉన్నదని నిర్ణయించుకుని, ఒక రోజు బుల్డోజర్లతో గ్రామనికి వచ్చి అక్కడున్న ఇళ్ళను పడగొట్టడం మొదలు పెట్టేడు. అతను చేస్తున్న పనికి మొదట్లో కోపం తెచ్చుకున్న గ్రామ ప్రజలు, అతను చేయదలుచుకున్నది తెలుసుకుని ఆశ్చర్యపోయేరు.

ఆ గ్రామంలోని మామూల ఇళ్ళను పడగొట్టి వాల్లందరికీ పక్క ఇళ్ళు కట్టించి ఆ గ్రామమును ఒక కాలనీగా చేసి వారికి అందించేడు. రుణం తీర్చుకోవడం అంటే ఇదే...!


2 comments:


  1. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మన దేశం లోను రావాలి !

    జిలేబి

    ReplyDelete
  2. అన్ని ధర్మాల సమాహారమే కృతజ్ఞత!
    అన్ని పాపాల సమాహారం కృతఘ్నత!

    ReplyDelete