Tuesday, November 25, 2014

మనం వెళ్ళడానికి అనుమతి లేని ప్రదేశాలు

ఫ్రాన్స్ దేశంలోని లస్కౌక్స్ గుహలు
17,300 సంవత్సరాలకు ముందు రాతి పనిముట్లతో, ఖనిజ వర్ణాలతో గోడలమీద వేయబడిన చిత్రాలు. ఈ చిత్రాలలో ఆ కాలంలో ఉండే అతిపెద్ద జంతువుల బొమ్మలే గీయబడి ఉన్నాయి. 1940 లో ఈ గుహ కనుగొనబడింది. 1948 లో పర్యాటకులను అనుమతించేరు. పర్యాటకుల వలన ఆ గుహలోని చిత్రాలకు హాని జరుగుతోందని తెలుసుకుని 1963 లో గుహలను మూసేసేరు. అక్కడికి వెళ్ళటానికి ఎవరినీ అనుమతించరు.

పొవిగ్లియా ద్వీపం, ఇటాలి
2000 సంవత్సరాలకు ముందే ఈ ద్వీపం గురించి పురాణాలలో రాయబడింది. 1348 లో వెనిస్ నగరంలో ప్లేగ్ వ్యాధితో బాధపడుతున్న కొన్ని వేల మందిని మొదటిసారిగా ఈ ద్వీపానికి తరలించేరు. తిరిగి 1793 లోనూ మరియూ 20వ శతాబ్ధం ప్రారంభంలోనూ అదే వ్యాధితో బాధపడుతున్న వేలాది మందిని ఈ ద్వీపానికి తరలించేరు. 1922 లో అక్కడ కొన్ని భవనాలను కట్టి, అప్పుడు ఆ ద్వీపములో బ్రతికున్నవారికి చికిత్స అందించేరు. అప్పటికే అంతకు ముందు అక్కడకు పంపిన వారు చనిపోయి ఆత్మలుగా తిరుగుతూ ఆ ద్వీపానికి వచ్చిన వారిని చంపుతున్నారని 1968 లో ఆ ద్వీపములోని అన్ని భవనాలనూ మూసేసి తిరిగి వచ్చేసేరు. అప్పటి నుండి ఆ ద్వీపానికి వెళ్ళటానికి ఎవరికీ అనుమతిలేదు.

వాటికన్ రహస్య ప్రాచీన భాండాగారం,ఇటాలి
52 మైళ్ల పొడవుకు అరలున్న ఈ ప్రాచీన భాండాగారంలో కాథలిక్ చర్చి యొక్క మతపరమైన చట్ట చర్యలు గురించి రాసున్న పత్రాలు భద్రపరచబడి ఉన్నాయట. ఈ ప్రాచీన భాండాగారం మత ప్రచారం మొదలైనప్పటి(అపోస్టోలిక్ వయసు)నుండి (C-33 )ఉందని చెబుతారు. 1881 వరకు ఈ ప్రాచీన భాండాగారం లోపలకు వెళ్ళటానికి ఒక్క పోప్ కు మాత్రమే అనుమతి ఉండేదట. ఈ రోజు ఎవరైనా వెళ్ళాలంటే వారు The Davinci Code’s తీవ్ర పరిశోధకుడిగా గుర్తింపు ఉండాలి.

ఇతియోపియా దేశంలో ఉన్న Our Lady Mary of Zion చర్చి
4 వ శతాబ్ధములో ఆఫ్రికా దేశాన్ని పరిపాలించిన మొదటి క్రైస్తవ చక్రవర్తి దీన్ని నిర్మించేరు. ఈ చర్చిలో ఉన్న చిన్న చర్చి( గర్భ గుడి)లోని పవిత్రమైన నిబంధన మందసము(sacred Ark of the Covenant)ను పూజించటానికి ఒక మత గురువును నియమించారు. ఆయనకు మాత్రమే ఆ చర్చిలోకి వెళ్ళేందుకు, అక్కడ ప్రార్ధన చేసేందుకు, అగరవొత్తులు వెలిగించేందుకు అనుమతి. ఆ మతగురువు చనిపోయేంతవరకు ఆ గర్భ గుడిలోనే ఉండాలి . చనిపోయేముందు తన వారసుడుగా ఎవరినైనా ప్రకటించాలి. క్రైస్తవ చక్రవర్తి ఉన్నంతవరకు ఎలా చేయగలిగేరో తెలియదు కానీ ఆ తరువాతే తెలిసింది, అ గర్భ గుడిలోకి ఒక మనిషి వెళ్ళటానికీ, నివసించటానికీ, బయటకు రావడనికి ఎంతమాత్రం దారే లేదని. పరిశోధకులు గర్భగుడిలో అమర్చబడ్డ నిబంధన మందసము యొక్క అంగీకారము గురించి తెలియదు కాబట్టీ ఈ చర్చిలోకి వెళ్ళటానికి ఎవరికీ అనుమతిలేదు. అనుమతించరు.

జియాంగ్ స్యూ జాతీయ రక్షణ మ్యూజియం, చైనా
చైనా దేశములోని నన్ జింగ్ నగరములో ఉన్న ఈ మ్యూజియంలో ప్రపంచ దేశాలపై చైనా గూఢచర్యం చేసిన పత్రాలు, గూఢచర్యంలో ఉపయోగించబడ్డ వస్తువులు భద్రపరచబడ్డాయి. ఈ వస్తువులలో పెన్నులు, లిప్ స్టిక్లు మరియూ గూఢచర్యం ఎలా చేసేరో అని రాసున్న పత్రాలు మరియు మ్యాపులు ఉన్నాయి. ఈ మ్యూజియమును చూడటానికి విదేశీయులకు అనుమతిలేదు. చైనా దేశస్తులు మ్యూజియమును చూడాలనుకున్నా వారికి కూడా ఎన్నో ఆంక్షలు విధించేరు. దీనితో ఈ మ్యూజియం ఎవరూ వెళ్ళలేని చోటుగానే ఉంటోంది.

పైన్ గాప్, ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా దేశంలోని ఉత్తర భాగంలో ఆస్ట్రేలియా మరియు అమెరికా కలిసికట్టుగా నడుపుతున్న ఉపగ్రహ ట్రాకింగ్ స్టేషన్. పైన్ గాప్ ను ముఖ్యంగా వాడుకునేది అమెరికా దేశమే. వారి దేశానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ గూఢచార సంస్థలైన సి.ఐ.ఏ, ఎన్.ఎస్.ఏ. మరియు ఎన్.ఆర్.ఓ కార్యకలాపాలు ఇక్కడి నుండే జరుగుతాయి. అమెరికా గూఢచార ఉపగ్రహాల నుండి వచ్చే సమాచారమును మరియు ప్రపంచ నిఘా నెట్వర్క్ ECHELON అందించే వార్తలను సేకరించే ప్రదేశం. ఇక్కడికి సాధారణ మనిషి వెళ్ళలేడు. అలా వెళ్ళటానికి ప్రయత్నించిన వారు ఖైదు చేయబడి, శిక్చలు అనుభవిస్తున్నారు.

ఐసే గ్రాండ్ ష్రైన్, జపాన్
జపాన్ దేశములోని షింటో మతం వారి అత్యంత పవిత్రమైన మందిరం. ఐసే అనే నగరములో ఉన్నందున ఈ మందిరానికి ఈ పేరు వచ్చింది. జపాన్ దేశములోని షింటో మత మందిరాలన్నిటికీ ఇది కేంద్రం. ఈ మందిరాన్ని Amaterasu-ōmikami (విశ్వానికి దేవత) కు సమర్పించుకున్నారు. ఈ మతానికి చెందినవారు ప్రకృతినే దైవముగా భావించి వానలూ మరియు సముద్రం సూర్యుడిని దేవునిగా కొలుస్తాయని నమ్ముతారు. 2000 సంవత్సరాల క్రితం ప్రకృతి అందించిన కొన్ని వస్తువులను అక్కడ భద్రపరిచేరట. ఈ మందిరంలోకి ఎవరూ వెళ్లకూడదు. జపాన్ దేశములోని షింటో మతస్తులు కూడా ఈ మందిరం బయట నుండే ప్రార్ధనలు చేసుకోవాలట.

మెట్రో-2, రష్యా
మాస్కో నగరంలో ఇప్పుడున్న మెట్రో రైల్వే లైనుకు సమాంతరంగా మెట్రో-2 రైల్వే లైన్లు ఉన్నట్లు చెబుతారు. ఇది ఒక రహస్య రైలు మార్గమని, దీనిని రష్యా గూడచార సంస్థ కె.జి.బి వాడుతున్నదని, ఈ రైల్వే లైనును స్టాలిన్ పరిపాలనలో వేసేరని, దీని రహస్య పేరు D-6(Д-6)అని, రష్యా రక్షణ శాఖ దీనిని నడిపిస్తున్నదని చెబుతున్నారు. 1994 లో రష్యా పట్టణ అన్వేషణ సమూహం లోని ఒక వ్యక్తి పాతాళలోకం తవ్వకాల శోధనలప్పుడు భూమిని తవ్వుతున్నప్పుడు ఈ రైలు మార్గాన్ని కనుగొన్నానని తెలిపేడు. రష్యా ప్రభుత్వం అటువంటిదేమీలేదని చెబుతోంది., మరింకెవరూ ఈ రైలు మార్గం గురించి చెప్పటంలేదు.

No comments:

Post a Comment