Monday, November 3, 2014

అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్స్.....ఫోటోలు

ఎప్పుడైతే మార్కెటింగ్ మేధావి మంచి నీళ్ళను ప్లాస్టిక్ బాటిల్స్ లో పోసి, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయవచ్చని అనుకున్నాడో, అప్పటి నుంచి ప్రజలు ఆశ్చర్యకరమైన డబ్బును ఖర్చు చేసి ప్లాస్టిక్ బాటిల్ వాటర్ ను కొనుకుంటున్నారు.ఈ మార్కెటింగ్ ట్రెండ్ను ఉపయోగించుకుంటూ మరికొంతమంది హాస్యాస్పద మరియు వింత రేట్లతో మంచి నీళ్ళను అమ్ముతున్నారు.

ప్రతి మనిషి జీవించడానికి మంచి నీళ్ళు కావాలి. అలాంటి మంచి నీటిని అత్యంత ఖరీదుకు అమ్ముతున్నారంటే అది చాలా క్రూరమైన పని. కానీ, తెలివితక్కువ మనుష్యులు అంత ఖరీదైన మంచినీటి బాటిల్స్ ను కొనుకుంటున్నారంటే వారినేమనాలి?

Christian Lacroix for Evian.....ఒక బాటిల్ రూ.600/-....కారణం...బాటిల్ స్టైల్ కోసం

AquaDeco.....ఒక బాటిల్ రూ.750/-.....కారణం...4 బాటిల్స్ కలిపి(ఒకదానిపై ఒకటి)

10 Thousand BC....ఒక బాటిల్ రూ.850/-.......కారణం....ఐస్ కొండల నుండి తెప్పించిన మంచి నీళ్ళట

Hello Kitty Fillico....ఒక బాటిల్ రూ.6000/-.......కారణం....బాటిల్ మూత పైన క్రిస్టల్స్ అమర్చేరట

Kona Nigari....ఒక బాటిల్ రూ.25,000/-.....కారణం....హవాయ్ లో ఉన్న కోనా సముద్రం లోతు నుండి తీయబడినదట. సాంద్రీకరించబడిన ఈ నీటిని కొంచంగా తీసుకుని వేరే మంచి నీటితో కలుపుకుని తాగ వచ్చునట

Exousia Gold....ఒక బాటిల్ రూ.14 లక్షలు.....కారణం...ఇందులో బంగారం అణు లక్షణాలు ఉన్నాయట

No comments:

Post a Comment