Wednesday, November 12, 2014

సంవత్సరానికి ఒకసారి 11 వ నెల, 11 గంటల 11 నిమిషాలకు స్మారక చిహ్నం మీద సూర్యరస్మి పడుతుంది....ఫోటోలు

అమెరికాలో లోని అరిజొనాలోని ఆంతెం వెటెరన్స్ మెమోరియల్ అనే చోట కట్టిన సైనికి వీరుల స్మారక చిహ్నం పై 5 స్థంబాలలో(వేరు వేరు ఎత్తులలో) అమర్చిన రంద్రాల నుండి సూర్యరస్మి వెళ్ళి స్థంబాలకు ముందు అమర్చిన ఆ సైనిక వీరుల స్మారక చిహ్నంపై పడుతుంది.

ప్రతి సంవత్సరం నవంబేర్ నెల(11 వ నెల) 11 వ తారీఖున చనిపోయిన సైనిక వీరుల రోజుగా ప్రకటించి ఆ రోజు వారిని గుర్తుకు తెచ్చుకుని వారికి నివాళులు అర్పిస్తారు. దీనికోసం ఒక ప్రత్యేక రీతిలో నేల మీద స్మారక చిహ్నం అమర్చి దాని ముందు 5 స్మారక స్థంబాలు అమర్చి, అందులో రంద్రాలు ఏర్పరచి సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు నేలమీదున్న స్మారక చిహ్నం మీద ఆ స్థంభాల నుండి, రంద్రాలలో నుండి సూర్యరస్మి పడేటట్లు అమర్చేరు. దీనీని చూడటానికి ఎంతోమంది పర్యాటకులు అది చూడటానికి ఆరోజుకు అక్కడికి వస్తారు.


No comments:

Post a Comment