Saturday, October 18, 2014

వరదలప్పుడు మట్టి కట్టలతో తమ ఇళ్ళను ద్వీపాలుగా మార్చుకున్న ప్రజలు....ఫోటోలు

ఎక్కడ అని అనుకుంటున్నారా? అమెరికాలో. 2011 సంవత్సరం అమెరికాలో రెండు తుఫానల వలన మిస్సిసిపీ నదిలో కనివినీ ఎరుగనంత వరద ఏర్పడింది. దాంతో నది పొంగి చుట్టుపక్కలున్న గ్రామాలను ముంచెత్తింది. కొన్ని గ్రామాలు 20 నుండి 30 అడుగుల నీటిలో మునిగిపోయినై. తుఫానల వలన వరద ఏర్పడుతుందని, ప్రమాదం ముంచుకోస్తొందని ప్రభుత్వం హెచ్చరికలు జారీచెసి చుట్టుపక్కలున్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేరు. కానీ కొంతమంది తమ ఇళ్లను కాపాడుకోవాలని తమ ఇళ్ల చుట్టూ మట్టితో నింపిన మూటలను అమర్చుకున్నారు. గ్రామ ప్రజలందరూ దీనికోసం ఒకరికొకరు సహయపడ్డారు. ప్రభుత్వం కూడా తమవంతు సహాయం చేసింది. అయినా చాలా ఇళ్లు వరదలో మునిగిపోయేయి. కొన్ని మాత్రం వరదను తట్టుకున్నాయి. అవే మీరు చూస్తున్న ఫోటోలు. అమెరికాలోని టన్నెస్సే స్టేట్ లోని మెంఫిస్ నగర ప్రాంతంలోని కొన్ని గ్రామాలు.


No comments:

Post a Comment