Tuesday, October 7, 2014

ప్రాయశ్చిత్తం రోజు: ఈ రోజున ఇజ్రైల్ దేశములో అన్నీ బంద్......ఫోటోలు

ఒక సంవత్సరంలో 24 గంటలు ఇజ్రైల్ మొత్తం రవాణా ఆగిపోతుంది. ఎందుకంటే ఆ రోజును వారు "యోం కిప్పూర్" అని పిలుచుకుంటారు. ఆ ఒక రోజును యూదులు ఒక పవిత్ర దినముగా భావిస్తారు. ఆ రోజు కార్లు, విమానాలు, రైళ్లు, బస్సులూ నడవవు. రేడియోలలో పాటలూ, టీ.వీ లలో కార్యక్రమాలు ఉండవు. షాపులూ, హోటళ్లు, వ్యాపార సంస్థలు మూసేస్తారు. ఆ రోజున దేశమే శ్తంభించిపోతుంది. దేశ వ్యాప్తంగా రోడ్లన్నీ ఖాలీగా కనిపించడంతో అక్కడ ఒక విధమైన నిశ్శబ్ధం చోటుచేసుకుంటుంది. ఆ రోజు వాతావరణ కాలుష్యం 99 శాతం తగ్గిపొతుందని ప్రజలు ఈ సంధర్బాన్ని వాడుకుని రోడ్లమీద నడవటం, పిల్లలు సైకిల్ల మీద తిరగడం జరుగుతుందట. ఈ రోజున చాలామంది యూదులు ఆ ఇరవైనాలుగు గంటలూ ఉపవాసాలు ఉంటారట. పచ్చి మంచినీళ్లు కూడా తాగరట. ఇలా చేయాలని చట్టమేమిలేదట. కానీ అందరూ తమకితాముగా ఈ పవిత్రరోజును మరే కార్యక్రమాలకూ వాడుకోకుండా ప్రార్ధనలకు మాత్రమే వాడుకుంటారట. అలాచేస్తే పాపాలన్ని పోతాయని వారి నమ్మకమట. ఈ సంవత్సరం ఈ నెల 3 వ తారీఖు సాయంత్రం మొదలై, 4 వ తారీఖు సాయంత్రం దాకా ఈ పవిత్ర దినము అమలులో ఉన్నది.


No comments:

Post a Comment