Monday, October 6, 2014

జపాన్ వారి క్రేజీ ఆవిష్కరణలు.... వివరాలూ, ఫోటోలు

విప్లవాత్మక వితరణ యంత్రాలు
వితరణ యంత్రాలు ప్రపంచంలో పెద్దగా మార్పు తెలేకపోయేయనే చెప్పాలి. నిజానికి ఈ ఆధినిక వితరణ యంత్రాలు 1800 నుండే వాడకంలో ఉన్నాయి. జప్పాన్ దేశం మాత్రం ఈ వితరణ యంత్రాల ఉపయోగాన్ని రోజూ ఉపయోగించుకునే యంత్రంగా మార్చుకుంది. ఒక విధంగా ఈ వితరణ యంత్రాల వాడకాన్ని తక్కువ అంచనా వేయకండి అని ప్రపంచానికి చెప్పకుండా చెబుతోంది. ఏవో అల్పహార పధార్ధాలూ, కూల్ డ్రింక్ టిన్నులూ అని మాత్రమే కాకుండా కోడిగుడ్ల దగ్గరనుండి గొడుగుల దాకా, తాజా ఆకుకూరల దగ్గర నుండి లోపలవేసుకునే బనీన్లూ, జట్టీల దాకా ఈ వితరణ యంత్రాలను ఉపయోగిస్తున్నది. మరోవిధంగా చెప్పాలంటే ఈ వితరణ యంత్రాలను ఒక చిన్న మార్కెట్ లాగా ఉపయోగించుకుంటున్నారు. మరి మిగిలిన ప్రపంచం కూడా ఈ వితరణ యంత్రాల ఉపయోగంలో జపాన్ దేశాన్నీ అనుసరిస్తాయా అనేది వేచి చూడాల్సిన విషయం.

మెదడును చదివే కెమేరా
మెదడు యొక్క పూర్తి శక్తిని తెలుసుకోవాలనేది ప్రపంచ శాస్త్రవేత్తల కల. దీనికోసం వారందరూ రాత్రింపగళ్లు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. జపాన్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో ప్రాధమిక మెదడును చదివే కెమేరా ఒకటి కనిపెట్టి దానికి "న్యూరో కెమేరా" అని పేరుపెట్టేరు. ఇది మెదడు తరంగాలను రెకార్డు చేసి దానిని ఒక ఇమేజ్ గా రూపొందించి అందిస్తుంది. ఈ టెక్నాలజీ బాల్య దసలోనే ఉన్నది. ఈ టెక్నాలజీని మన కలలనూ, జ్ఞాపకాలను మరియూ ఆలోచనలను రికార్డుచేసి వాటిని చిత్రం రూపంలో అందించడం కోసమే రూపొందిస్తున్నారు.

రేడన్ డ్యువల్ ఆర్గానిక్ బ్యాటరీ
స్థిరమైన మరియూ పునరుత్పాదక కరెంటు గురించే ఇప్పుడు ప్రపంచవ్యాప్తమగా చర్చ జరుగుతోంది. వాతావరణ మార్పును ఎలా పోరాడాలి అనేదే ఈ నాటి ప్రపంచవ్యాప్త ఆందోళన. దీనికోసమే కరెంటు మరియూ వాతావరణ మార్పు విషయాలలో ముందు నిలబడుతున్న జపాన్ దేశం ఈ స్థిరమైన మరియూ పునరుత్పాదక బ్యాటరీలను తయారుచేస్తోంది. ఈ బ్యాటరీలు మామూలు బ్యాటరీల కంటే 20 రెట్లు కరెంటును దాచుకోగల శక్తి మరియూ త్వరిత రీతిలో తక్కువ కరెంటును తీసుకుని చార్జ్ చేసుకోగల శక్తి కలిగియున్నది. వీటిని ఇన్వర్టర్లలో ఉపయోగించటనికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువ బరువున్న, అధిక శక్తి కలిగిన, ధరింపదగిన PLL-0 రోబోట్
చైతన్యరహిత మనుష్యులకు, వారు మామూలు మనుష్యులలాగా నడవటానికీ, కదలడానికీ, పరిగెత్తడానికీ రోబోటిక్ టెక్నాలజీ ఏంతో ఉపయోగకరంగా ఉన్నది. పానాసోనిక్ కంపెనీ వారు ఈ ధరింపదగిన రోబోటికి పరికరాలలో మరింత విస్తారమైన మెరుగుదలలు ఏర్పరచి ఎక్సో స్కెలిటల్ రోబోటిక్ దుస్తులను తయారుచేస్తున్నారు. ఒకప్పుడు సైనికుల వరకే పరిమితం చేయబడ్డ ఈ దుస్తుల అనువర్తనంను మామూలు ప్రజలకు కూడా అందించ దలచుకున్నారు. ఈ రోబోటిక్ దుస్తులను వేసుకుంటే మనిషి తన మామూలు శక్తితో ఎంత భారం, పనిచేయగలడో దానికన్నా ఎక్కువ శక్తితో పనిచేస్తాడు.

సూపర్ HD 4K టెలివిజన్
ఈ టీవీలో మనం ఏదైనా ప్రొగ్రాం చూస్తూంటే, మనం ఆచోట ఉండి నేరుగా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. 2016 లో ఈ టెలివిజన్ను విడుదలచేస్తారు.

మనుష్యుల పోలిన రోబోట్లు
ఇప్పటికే ఇలాంటి రోబోట్లను 3 దాకా తయారుచేసేరు. మనుష్యుల మధ్య ఇవి కలిసిపోతే వీటిని రోబోట్లుగా కనిపెట్టడం కష్టం.

అసిమో రోబోట్....పనిచేసే రోబోట్లు
రోబోటిక్ టెక్నాలజీలో జపాన్ దేశం అన్ని దేశాలకన్నా 15 సంవత్సరాలు ముందుంది. ఈ రోబోట్లు అన్ని పనులూ చేస్తాయి.

అంతరిక్ష ఎలివేటర్
అంతరిక్ష ఎలివేటర్లను తయారుచేయడంలో పలుదేశాలు పోటీ పడుతున్నాయి. 1800-1900 మధ్యలోనే రష్యా శాస్త్రవేత్తలు ఇందులో మొట్టమొదటి అడుగువేసేరు. అమెరికా దేశం అంతరిక్ష ఎలివేటర్ టెక్నాలజీకి ప్లాను వేసేవారికి 5,00,000 డాలర్లు బహుమతి ఇస్తామని 2007 లో ప్రకటించేరు. ఇంకా ఆ బహుమతిని ఎవరూ అందుకోలేదు. కానీ జపాన్ దేశములో ఒబయాషీ అనే ఒక కంపెనీ తమ దగ్గర టెక్నాలజీ ప్లాన్ ఉన్నదని, దానీని మేమే వాడుకుంటామని, 2050 లో ఖచ్చితంగా అంతరిక్ష ఎలివేటర్ రెడీ అవుతుందని తెలుపుతున్నారు.

No comments:

Post a Comment