Thursday, October 30, 2014

జార్కండ్ రాష్ట్ర జరియా గ్రామం లోని బొగ్గు మంటలు.....ఫోటోలు

జరియా మరియూ బోకాపెహరీ అనే ఈ రెండు గ్రామాలు జార్కండ్ రాష్త్రంలో ఉన్నాయి. ఇక్కడే భారత దేశ అత్యంత బొగ్గు నిలువ ఉన్నది. భారతదేశ అభివ్రుద్దికి కావలసిన కరెంటులో 70 శాతం బొగ్గువలనే దొరుకుతోంది. కానీ జరియా మరియూ బోకాపెహరీ గ్రామాల చుట్టుపక్కల నివసిస్తున్న 90,000 మందికి మాత్రం ఎటువంటి లాభమూ లేదు. భూమి క్రింద బొగ్గు మంటలు మండిపడుతూ చెడ్డ రసాయనాలు భూమి పగుళ్ళలోనుండి ఇళ్ళలోకి వస్తాయి. గత వంద సంవత్సరాల ఎడతెగని బొగ్గు గనుల తవ్వకం మరియూ భూమి క్రింద మంటలు ఆ ప్రాంతాన్నే(మట్టి, నీళ్ళు, గాలి) కాలుష్యం చేసినై. దీనివలన ఆ ప్రాంత ప్రజలకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు సంక్రమించినై. మరో విధంగా చెప్పాలంటే గ్రామ ప్రజలందరూ వ్యాధిగ్రస్తులే. ఒక్కోసారి భూమి పగుళ్లు పెద్దవై ఆ గ్రామ ప్రజల ఇళ్ళను అక్కడి భూమి మింగేస్తోంది. 1970 వరకు ఈ ప్రాంతములో దొగతనంగా బొగ్గును తవ్వి తీసుకుపోయేవారు. 1971 లో బొగ్గు గనులను ప్రభుత్వం జాతీయం చేసుకున్నది. అంతవరకు ఆ గ్రామ ప్రజలు చిన్నచిన్న గోతులు తవ్వి బొగ్గును లోకల్ మార్కెట్లో అమ్మి డబ్బుచేసుకుని బ్రతికేవారు.

మొదటిసారిగా 1916 లో ఈ ప్రాంతంలో బొగ్గు ఉన్నదని కనుగొన్నారు. చిన్న చిన్న మంటలు భూమి క్రింద నుండి వస్తుంటే అక్కడ బొగ్గు ఉన్నదని కనిపెట్టేరు. అప్పటి నుండి 1971 వరకు సుమారు 41 మిల్లియన్ టన్నుల బొగ్గును అక్రమంగా తవ్వుకుపోయేరట. దాని ఖరీదు కొన్నివేల కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ అక్కడి ప్రజలకు మాత్రం ఎటువంటి మేలూ జరగలేదుట.


No comments:

Post a Comment