Wednesday, October 15, 2014

ప్రపంచాన్ని వణికిస్తున్న ఇబోలా వైరస్ గురించి తెలుసుకోవలసిన కొన్ని నిజాలు....ఫోటోలు

'ఎబోలా రోజు రోజుకీ అతి వేగంగా విస్తరిస్తోంది..అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలి..త్వరలో ప్రతి వారం పది వేల మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది''..అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికాలు జారీ చేసింది. దీనితో ఎబోలా వ్యాధి పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఎబోలా కారణంగా 4,447 మంది మృతి చెందారని డబ్ల్యూహెచ్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రూస్ ఐల్ వార్డ్ హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 8,914 ఎబోలా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. గతంలో ఏబోలా సోకిన వారిలో 50 శాతం మంది మాత్రమే మరణిస్తుండగా ప్రస్తుతం 70 శాతం మంది మరణిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరణించిన వారిలో ఎక్కువ మంది పశ్చిమాఫ్రికా దేశాలైన లైబీరియా, సియర్రా లియోన్‌, గినియా దేశాలకు చెందినవారని వెల్లడించారు. ఇప్పుడు అమెరికా దేశంలో కూడా ఈ రోగం పాకిందని చెబుతున్నారు.

No comments:

Post a Comment