Friday, October 10, 2014

ఆర్కిటిక్‌ మహాసముద్రంలో ఐస్ గడ్డలు కరిగిపోతున్నందువలన 35,000 నీటి గుర్రములు(వాల్‌రస్)తీరానికి వచ్చినై....ఫోటోలు

వాల్‌రస్ ఆర్కెటిక్ ధృవము లో ఉండే ఒక భారీ శరీరము కలిగిన జంతువు. ఏనుగు దంతాల వలే బయటకు వచ్చిన కొమ్ములు, ఎర్రటి కళ్ళతో వాల‌రస్ లు ఆకర్షణీయమైన ఆర్కిటిక్ జంతువుల లో ఒకటి. ఇది భూమ్మిద, నీళ్ళ లో ను బ్రతకగలిగే క్షీరదము. వాల్‌రస్ ను ఎలిఫెంట్ సీల్ తో కన్ ఫ్యూజ్ అవడము జరుగుతుంది. పసిఫిక్ మగ వాల్‌రస్ సుమారుగా 1900 కె.జీ. లు, అట్లాంటిక్ వాల్‌రస్ సుమారుగా 1600 కె.జీ లు ఉండి సుమారు ఒక చిన్న కారు పరిమాణము లో ఉంటాయి.

సగము జీవితము నీళ్ళ లో మిగతా సగము బీచ్ లో, మంచు లో గడిపే వాల్‌రస్‌లు పెద్ద పెద్ద గుంపులుగా గుమి గూడతాయి. ఇవి ఒక సారి రోజుల తరబడి సముద్రము లో గాని ఒడ్డున గాని ఉంటాయి. తెడ్ల వంటి పెక్టోరల్(ఛాతీ దగ్గర) ఫ్లిప్పర్ల సహకారముతో నడుస్తాయి. చేపలు, ఆల్చిప్పలు, పీతలు,ఇతర మొలస్క్లు (అంటే జెల్లీ ఫిష్ వంటివి) వంటి సుమారు 60 రకాల సముద్ర జీవరాశులను భోజనము చేస్తాయి. పెద్ద మగ వాల్‌రస్ లు ఇంక ఏవీ దొరకనప్పుడు సీల్ జంతువుల తో పోరాడతాయి.

ఆర్కెటిక్ మహాసముద్రము అమెరికాలోని అలస్కా నగరము, కెనడా దేశమూ, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశములోని గ్రీన్లాండ్, ఐస్లాండ్, నార్వే, రష్యా మరియూ స్వీడన్ దేశాల చుట్టూ ఉంటుంది. ఇక్కడ, అంటే ఈ సముద్రపు నీటిలో ఎప్పుడూ ఐస్ గడ్డలు తయారవుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ నీటి ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు తక్కువగా ఉంటుంది. ఈ మధ్య సముద్రపు నీటి ఉష్ణోగ్రత పెరగడంతో ఐస్ గడ్డలు తయారవటంలేదు. అందువలన ఈ నీటి గుర్రములు వేల సంఖ్యలో తీరానికి వస్తున్నాయి. మొదటిగా 2007, 2009, 2011 లో అమెరికాలోని అలస్కా నగర తీరానికి వచ్చినై. మళ్ళీ ఇప్పుడు వచ్చినై. వాతావరణ కాలుష్యంవలనే ఇలా జరుగుతున్నదని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు.


No comments:

Post a Comment