Wednesday, October 8, 2014

2014 లో సాంకేతికంగా ఉన్నతస్థాయిలో ఉన్న దేశాలు..... వివరణ మరియూ ఫోటోలు

చైనా
తరచుగా తదుపరి సూపర్ పవర్ దేశంగా పిలవబడుతున్న చైనా టెక్నాలజీలో ప్రధాన అభివృద్ధులు చేసుకుని ప్రపంచాన్నే ఆశ్చర్యపరించింది. గన్ పౌడర్ మరియూ కాంపస్ ను మొదటిగా వాడిన(కనుగొన్న) దేశం చైనా. ఇప్పుడు ఈ దేశం రోబోటిక్స్, సెమి-కండక్టర్లు, హై-స్పీడ్ రైళ్ళు, సూపర్ కంప్యూటర్లు, జన్యుశాస్త్రం మరియూ ఆటోమొబైల్స్ రంగాలలో దృష్టి సారించింది. అంతరిక్ష అన్వేషణలో క్రమంగా పధకాలను విస్తరిస్తున్నది.

నెదర్లాండ్
టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు తయారీలో ముందున్న ఈ దేశం కంప్యూటర్, ఎలక్ట్రానిక్ కొలత మరియూ నియంత్రణ పరికరాలు, వైద్యం మరియూ సైన్స్ రంగాలలో ప్రధాన అభివృద్ధులు కలిగియుంది. కాంపాక్ట్ డిస్క్, కృత్రిమ కిడ్నీలు, టెలిస్కోప్, సూక్ష్మదర్శిని మరియూ లోలకం గడియారం కనుగొన్నది ఈ దేశమే.

సింగపూర్
ఈ దేశం హైటెక్ స్నేహపూర్వక వ్యాపార దేశం. జ్ఞాన ఆధారిత ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థలో కొత్త ఆవిష్కరణలు చెసిన దేశం. ప్రపంచములోనే అత్యధిక వేగమైన అంతర్జాల స్పీడ్ కలిగిన దేశం. ఇళ్లలోనివారే 1 Gbps వాడతారు. ప్రజల అందరిదగ్గర స్మార్ట్ ఫోన్లు కలిగినదేశం.

కెనడా
సాంకేతిక నిర్ణీత దెశం. పారిశ్రామిక పరిశోధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. జీవసాంకేతిక విజ్ఞానం మరియూ అంతరిక్ష శోధనలలో ప్రత్యేకత కలిగినది. వైర్లెస్ ఇంటరాక్ట్ యంత్రాలు, చిప్ లేని క్రెడిట్ మరియూ డెబిట్ కార్డులు మరియూ ఉన్నతస్థాయి సూపర్ సోనిక్ విమానాలను ప్రవేశపెట్టిన దేశం.

యూనైటడ్ కింగ్ డం
ప్రపంచములోనే మొదటి పారిశ్రామీకరణ దేశం. హైడ్రోజెన్ ను కనుగొన్న దేశం. జెట్ ఇంజన్, లోకోమోటివ్ ఇంజిన్, వరల్డ్ వైడ్ వెబ్, విద్యుత్ మోటారు, ప్రకాశించే లైట్ బల్బు మరియూ వ్యాపార సంబంధ విద్యుత్ టెలిగ్రాఫ్ కనుగొన్న దేశం. మానవరహిత పోరాట గాలి వాహనం మరియ్తూ BAE సిస్టమ్ నౌక కనుగొన్న ఘనత వీరిదే.

ఫిన్లాండ్
హై-టెక్ ప్రాజెక్టులకు మరియూ ఆరోగ్య సౌకర్యాలకు పేరుపొందిన దేశం. మొబైల్ ఫోన్లలో కొన్ని సంవత్సరాల వరకు లీడర్ గా ఉన్న నోకియా పుట్టిన దేశం. బయోసైన్సె, కరెంటు మరియూ పర్యావరణ శాస్త్రంలో ఇప్పుడు తమ అన్వేషణను కొనసాగిస్తోంది.

రష్యా
చంద్ర మండల ఉపరితలం వరకు రాకెట్ ను పంపిన మొదటి దేశం. అంతరిక్ష సాంకేతిక విజ్ఞానంలోనే కాకుండా భారీ యంత్రాల విజ్ఞానంలోనూ పెద్ద నాన్నగా పిలవబడుతున్న దేశం. హై-టెక్ రక్షణ వ్యవస్థ కలిగిన దేశమే కాకుండా రక్షణా పరికరాలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశం. వీరు తయారుచేసిన ICBM క్షిపణి ప్రపంచములోనే సమర్థవంతమైనది.

జెర్మనీ
కొన్ని దశాబ్దములు గా ఇది హై-టెక్ దేశముగా ఉన్నది. అన్ని రంగాలలోనూ ముందంజలొ ఉన్న ఈ దేశం ముఖ్యముగా ఆటోమోటివ్ రంగంలో ఎదురులేని లీడర్ అనిపించుకున్నది. బెంజ్, ఆడి,బి.ఎం.డబుల్యూ, వోల్స్ వేగన్ మరియూ పోర్స్ చె వీరి ఉత్పాదనే. ఇజ్రైల్
ఈ దేశ ఎగుమతులలో 35 శాతం సాంకేతిక సంబంధిత ఉత్పత్తులే. వీరి దగ్గరే ఎలెక్ట్రిక్ కారు టెక్నాలజీ ఉన్నది. మానవరహిత నిఘా గాలి వాహనం టెక్నాలజీ వీరిదే.

సౌత్ కొరియా
ఎల్.జీ, హుండాయ్ మరియూ సాం సంగ్ పుట్టిన దేశం ఇది. ఆపిల్ మరియూ టొయేటా తో పోటీ పడుతున్న దేశం. రోబోటిక్స్ లో అత్యంత అభివ్రుద్దిలో ఉన్న దేశం. అమెరికాలో కంటే 3 రెట్ల వేగం కలిగిన ఇంటర్ నెట్ ఉన్న దేశం.

అమెరికా
అత్యంత సూపర్ పవర్ కలిగిన దేశం. ఆటంబాంబు నుండి చంద్రమండలంలో మనిషిని దింపిన టెక్నాలజీ కలిగిన దేశం. గూగుల్, ఫేస్ బుక్, ఆపిల్, ఇంటల్, ఐ.బి.ఎం మరియూ మైక్రోసాఫ్ట్ ఉన్న దేశం. అత్యంత ఆధునిక టెక్నాలజీతో సైనిక దళాలు కలిగిన దేశం.

జపాన్
సైన్స్ పరిశోధనలకు ముఖ్యత్వం ఇచ్చే దేశం. ఆటొమొబైల్స్, ఎలెక్ట్రానిక్స్ మరియూ రొబోటిక్స్ లో ప్రాముఖ్యత వహిస్తున్న దేశం. 1973 నుండి బయటి దేశాల నుండి దిగుమతి ఆపేసి తానుగా ఇంధన శక్తిని రూపొందించుకున్న దేశం.

No comments:

Post a Comment