Friday, September 26, 2014

భూగ్రహం మీద దొరికే అత్యంత ఆశ్చర్యపరిచే ఖరీదైన పదార్ధాలు, వాటి ఉపయోగాలు.....ఫోటోలు

తెల్ల పుట్ట గొడుగు.....ఒక గ్రాము ఖరీదు రూ.300/-. దీనిని పొడి చేసి ఏ ఆహారం మీదైన సరే జల్లుకుంటే, ఆ ఆహారం రుచి అద్భుతంగా ఉంటుంది.

కుంకుమ పువ్వు....ఒక గ్రాము ఖరీదు రూ. 700/-. అన్ని వ్యాధులకూ మందుగా వాడొచ్చు

ఇరాన్ బెలుగా కేవియర్.....ఒక గ్రాము ఖరీదు రూ. 2,100/-.....ఇది ఒక చేప గుడ్డు. ఆకలి వేయడానికి దీనిని వాడవచ్చు

బంగారం.....ఒక గ్రాము ఖరీదు రూ. 2,400/-.....నగలు,పెట్టుబడి లాంటివాటికే కాకుండా వస్తువులు తుప్పు పట్టకుండా ఉండటానికీ మరియూ విద్యుత్ వాహకతకూ ఉపయోగపడుతుంది.

రోడియం: ఇది తెల్లని లోహము.....ఒక గ్రాము ఖరీదు రూ. 2,700/-.....కార్లలోనుండి వెలువడే కార్బన్ ఉద్గారాలు తగ్గించటానికి వాడతారు

ప్లాటినం: ఇది తెల్లని లోహము. ఒక గ్రాము ఖరీదు రూ. 3,000/-.....ఆకస్మిక మార్పు కలిగించే వస్తువు. దీనిని సైన్స్ పరిశోధనలకూ, నగలకూ మరియూ క్యాన్సర్ వ్యతిరేక మందుగా వాడతారు.

ఖడ్గ మృగ కొమ్ము: ఒక గ్రాము ఖరీదు రూ. 3,300/-.....వియత్నాం దేశంలో ఖడ్గ మృగ కొమ్ము పొడి క్యాన్సర్ ను గుణపరుస్తంది నమ్ముతారు. అంతే కాకుండా చిన్న చిన్న మొతాదులలో ఇది జ్వరం మరియూ ఇతర జబ్బులను తగ్గిస్తుందని చెబుతున్నారు.

డి లా మెర్ అనే క్రీం: ఒక గ్రాము ఖరీదు రూ. 4,200/-.....ఈ విచిత్రమైన క్రీం రోజూ వాడితే అమరులవుతారట(వయోరహిత)

ప్లూటోనియం:ఒక గ్రాము ఖరీదు సుమారు రూ. 2,40,000/-.....ఏ వస్తువునైనా అణువుగా మారుస్తుంది. ఒకటి సైనిక ఆయూధంగానూ మరొకటి విద్యుత్ శక్తి గానూ.

ధూమ్రవర్ణ రత్నము: ఒక గ్రాము ఖరీదు రూ. 1,50,000 నుండి రూ. 12,00,000 దాకా ఉంటుంది. దీనిని ధరిస్తే అద్రుష్టం తప్పక వరిస్తుందట.

ట్రిటియం:ఒక గ్రాము ఖరీదు రూ. 18,00,000/-.....ఆఫీసులలోనూ, సినిమాహాలులలోనూ మరియూ స్కుల్లలోనూ ఎక్జిట్ అనే గుర్తుకు వాడతారట. ఒక్క అమెరికాలో మాత్రం 2 మిల్లియన్ల ట్రిటియం గుర్తులు వాడుతున్నారట.

కాలిఫోర్నియం 252: ఒక గ్రాము ఖరీదు రూ. 1620 మిల్లియన్. రేడియో ధార్మిక శక్తి గల ఈ ఐసోటోప్ ను నీరూ మరియూ నూనె కలిసున్న పోరలఓ వాడతారు. అప్పుడు నూనె వేరుగా, నీరు వేరుగా విడిపోతుంది.

విరుద్ద పదార్థం: ఒక గ్రాము ఖరీదు రూ. 6,000 ట్రిల్లియన్. రాబోవు కాలంలో అంతరిక్ష నౌకలకు ఇంధనము గా వాడతారు.

సోలారిస్: ఖరీదు 30 ఎం.ఎల్ వైల్ కు రూ.3,00,000/-...మందుల కంపెనీ వారు తమ పరిశోధనలలో వాడొకోవలసిన ముఖ్యమైన ముడి సరకు. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన మందు ఇదే. అత్యంత కీలకమైన వ్యాధులను గుణం చేసే ఈ మందు ఒక సంవత్సారం వాడల్సి వస్తే 3 కోట్ల 50 లక్షలు ఖర్చు పెట్టలి. బహుశ పోయే ప్రాణం ను ఆపగలిగే శక్తి ఈ మందుకు ఉండవచ్చు. యముడు పిలుస్తున్నా రానని ధైర్యంగా చెప్పచ్చు.

1 comment: