Saturday, September 27, 2014

భవిష్యత్తులో ప్రయాణానికి విభిన్న దారులు...వివరాలు.....ఫోటోలు

పురావృత్త నౌక: టైటానిక్-2
పురాతణమైన తరహాలో టైటానిక్ నౌక లాంటి ఒక నౌకను తయారుచేస్తున్నారు. ఈ నౌక పేరు టైటానిక్-2. ఇది 2018 నాటికి ప్రయాణానికి సిద్దమౌతుంది. దీని మొదటి ప్రయాణం ఇంగ్లాండ్ నుండి అమెరికాకు.

మోకు(తో లాగే) రైలుబండి
ప్రపంచములోనే అతి చిన్న రైల్వే ఇదే. 1901 లో లాస్ ఏంజల్స్ నగరంలో డౌన్ టౌన్ నుండి పైకి వెళ్లడానికి వేసిన రైల్వే లైన్. క్రింద నుండి పైకి వెళ్లడానికి 30 సెకండ్లు మాత్రమే పడుతుంది. 1969 వరకు ఇది పనిచేసింది తరువాత నగరాన్ని అభివ్రుద్ది చేయడానికి ఈ రైల్వేలైనును మూసేసేరు. మెరుగులు దిద్ది ఈ రైల్వేలైనును రెడిచేస్తున్నారు. త్వరలో ప్రయాణం చేయవచ్చు.

అం ట్రాక్: రచయతలను ప్రోత్సహించు రైలు
రచయతలకు రాయడానికి ప్రేరణ కలిపించడానికి ఏర్పాటుచేసిన ఈ ఆం ట్రాక్ రైలు అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలను చుట్టివస్తుంది. అత్యంత పొడవైన ఈ రైలు మార్గం బయలుదేరిన చోటుకు తిరిగిరావడానికి చాలా రోజులు(నెలలు)పడుతుంది. అందుకని ఈ రైలులో ఒక రూము,ఒక మంచమూ, ఒక టేబుల్, ఒక కిటికీ ఉంటుంది. 2015 లో ప్రయాణం మొదలుపెట్టబోతున్న రైలులో ప్రయాణం చేయడానికి 16,000 మంది ధరకాస్తు చేసుకున్నారు. అందులో 115 మందిని ఎంచుకున్నారు. ఇందులోనుండి చివరిగా 24 మందిని ఎంచుకుంటారు. ఆ 24 మంది మాత్రమే ఈ రైలులో ప్రయాణం చేస్తూ ఒక రచన ముగించాలి.

గాలి నౌక
1937 లో జరిగిన హిండన్ బర్గ్ విషాదం తరువాత ఆకాశ ప్రయాణానికి ఈ నౌకను విడిచిపెట్టేరు. 75 సంవత్సరాల తరువాత 2012 లో తిరిగి గాలి నౌకకు అనుమతి ఇచ్చేరు. ఇప్పుడు ఈ గాలి నౌక తాయారీలో ఉన్నది. బహుశ 2015లో ప్రయాణానికి సిద్దమౌతుంది.

అంతరిక్ష ఉల్లాస యాత్రలు
అంతరిక్ష ఉల్లాస యాత్రలకు పెద్ద పెద్ద సంస్ధలు సన్నాహలు చేస్తున్నాయి. సీటు బెల్టులూ మరియూ భూమి గురుత్వాకర్షణ శక్తి అభ్యాసము లేకుండా భూ ఆకర్షన శక్తికి పైన 68 మైళ్ల దూరమునకు ఈ యాత్రలు ఉంటాయి. ఇప్పటికే చాలామంది ఈ యాత్రకు తమ సీట్లను రిజర్వ్ చేసుకున్నారు. బహుశ 2015 నాటికి ఈ యాత్రలు మొదలవుతాయంటున్నారు.

సముద్రం క్రింద రైలు ప్రయాణం
చైనా నుండి అమెరికాకు సముద్రం క్రింద ఒక రైల్వే లైన్ వేస్తున్నారు. చైనా దేశం ఈ ప్రయత్నానికి సన్నాహాలు మొదలుపెట్టింది. చైనా నుండి రష్యా, కెనడా మీదగా అమెరికాకు సముద్రం క్రింద 8,000 మైళ్లకు రైల్వే టనల్ వేసి దాంట్లో రైల్వే లైన్ వేయబోతారట. టెక్నాలజీలో చైనా చెందుతున్న అభివ్రుద్ది చూస్తుంటే ఇది సాధ్యమేనని చెబుతున్నారు.

భూమి నుండి అంతరిక్షానికి ఎలివేటర్ ప్రయాణం
జపాన్ సంస్థ ఒభయాషీ కార్పోరేషన్ 2050 లోపల భూమి నుండి అంతరిక్షానికి ఎలివేటర్ వేయబోతామని తెలిపింది. భూమి నుండి సుమారు 96,000 కీ.మీ (59,652 మైళ్లు) దూరానికి ఈ ఎలివేటర్ వేయబడుతుందట. ఈ లోపు అంతరిక్షంలో నాసా వారి సహాయంతో ఒక పర్యాటక స్టేషన్(చోటు) కట్టబోతారట. కాబట్టి 2050 లో అంతరిక్షానికి ఎలివేటర్లో ప్రయాణం చేయవచ్చు.

No comments:

Post a Comment