Wednesday, September 24, 2014

ప్రపంచవ్యాప్తంగా జరిగిన వాతావరణ యాత్ర: చరిత్రలోనే అతిపెద్ద పర్యావరణ కాలుష్య నిరసన....ఫోటోలు

సెప్టంబర్ 23, 2014 న యూనైటడ్ నేషన్స్ లో ప్రపంచదేశాలన్నీ కలిసి వాతావరణ కాలుష్యం తగ్గించాలని, దానికి కావలసిన ప్రణాళికలు తయారుచేసి, దేశాలన్నీ కలిసి ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.ఇలా ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలు కలవడం, ప్రణాళికల గురించి ఆలొచింటమే గానీ ఒప్పందాలు చేసుకోవటంలేదు. కారణం ప్రతి దేశమూ ఇతర దేశాలను వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారకులని, కాబట్టి వారే ఎక్కువ వాతావరణ కాలుష్య నివారణలు చేపట్టాలని చెప్పడమే. ఇందువలన వాతావరణ కాలుష్య నివారణ పనులు ఏ దేశమూ శ్రద్దగా చెపట్టటంలేదు. దీని ఫలితంగా వాతావరణ కాలుష్యం ఎక్కువవుతోంది. ఇది కరువు, ఆరొగ్య చిక్కులూ, ఇతర ప్రక్రుతీ వైపరీత్యాలకు దారితీస్తోంది. నాయకుల అసమ్మతులతో విసుగెత్తిపోయిన ప్రపంచ ప్రజలు నాయకుల మీద ఒత్తిడి తేవటానికి నిరసన పోరాటం చేపట్టేరు. ఈ నిరసన పోరాటం సెప్టంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 4,00,000 మంది పాల్గొన్న ఈ నిరసన పోరాటం ప్రపంచ నాయకులలో మార్పు తెస్తుందని ఆసిద్దాం.


No comments:

Post a Comment