Thursday, September 25, 2014

గోరీ ద్వీపం: 16వ శతాబ్ధపు బానిసల ట్రేడ్ సెంటర్.....ఫోటోలు

రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్, పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. ఈ దేశానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ గోరీ ద్వీపం. దీని పరిమాణం 45 ఏకర్లే. 16వ శతాబ్ధములో ఈ ద్వీపమును బానిసల వాణిజ్య కేంద్రముగా నెదర్లాండ్ దేశం ఆక్రమించుకుంది. 1536 నుండి 1848 వరకు బానిసల వాణిజ్య కేంద్రముగా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా దొరికిన పేదవారిని ఇక్కడకు తీసుకు వచ్చి ఉంచేవారు. బానిసలు కావాలనుకునే ధనవంతులూ, దేశాలు ఇక్కడకు వచ్చి బానిసలను కొనుక్కుని వెళ్లవచ్చు. ఈ దీవిలో మొత్తం 28 బానిసల కేంద్రాలను కట్టేరు. బానిసలను గొలుసులతో ఇక్కడ కట్టి అమ్మకానికి ఉంచేవారు.

ఈ ద్వీపం నుండి బానిసలు తప్పించుకుని వెళ్ళలేరు. ఎందుకంటే చుట్టూ ఉన్న సముద్రం అత్యంత లోతుగా ఉండేది. అలా తప్పించుకుని పారిపోయిన కొందరు సముద్రములో మునిగిపోయేరు. ఇక్కడున్న బానిసలలో చాలామంది అమెరికాకు తీసుకువెళ్లబడ్డారని చెబుతారు.

1817 లో ఫ్రాన్స్ దేశం ఈ ద్వీపమును స్వాధీన పరుచుకుంది. 1960 వరకు వారి పరిపాలనలోనే ఉండేది. 1960 లో సెనెగల్ కు స్వాతంత్రయం ఇవ్వబడింది. అప్పటి నుండి సెనెగల్ ఒక దేశముగా ప్రకటించబడింది. గోరీ ద్వీపం సెనెగల్ పాలనలోకి వచ్చింది.

ఇప్పుడు ఈ గోరీ ద్వీపములో 1300 మంది మాత్రమే నివసిస్తున్నారు. వీరంతా ప్రశాంతంగా, కార్లూ, ఆధునికి భవనాలూ మరియూ నేరాలూ లేకుండా జీవిస్తున్నారు. ఈ ద్వీపమును చూడటానికి వచ్చే పర్యాటకులు ఈ ద్వీపమును ఇప్పుడు ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తున్నారు.


1839 లో ఇలా ఉండేదట.


18 వ శతాబ్ధములో బానిసల అమ్మకం ఫోటో ఆర్ట్.


2 comments:

  1. మంచి వ్యాసం. బానిస వ్యాపారం మానవ చరిత్ర మీద పెద్ద మచ్చ.
    అమెరికాలోని సౌత్ కరొలీనా రాష్ట్రం లో ఛార్లెస్టన్ అనే ఊరిలో కూడా ఈ వ్యాపారం విరివిగా జరిగేదిట. ఆ ఊళ్ళో బానిసల కొనుగోళ్ళు జరిగిన చోటుని స్లేవ్ మార్కెట్ అంటారు. ఇప్పుడు అదొక పెద్ద టూరిస్ట్ అట్ట్రాషన్.

    ReplyDelete
  2. ఎక్కువ చెప్పి మిమ్మల్ని విసిగించను.
    నిరుద్యోగ అభ్యర్దులకోసం పోటీ పరీక్షలకు అవసరంఅయిన స్టడీమెటీరియల్‌ రూపొందించి నవచైతన్య కాంపిటీషన్స్‌ (www.menavachaitanyam.blogspot.com) పేరుతో బ్లాగులో ఉంచుతున్నాను.
    ఒక్కసారి చూడండి.
    ఉపయోగపడుతుందని అనిపిస్తే
    మీ బ్లాగు వీక్షకులకు ఈ బ్లాగు గురించి చెప్పి వీలైనంత ఎక్కువ మంది నిరుద్యోగులకు చేరువకావడానికి సహకరించండి.

    --
    S.CHAITANYA KUMAR

    ReplyDelete