ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Tuesday, September 30, 2014
మాస్కో లో పాలకూర(సాలడ్)ను ఎలా కడిగి, ముక్కలుచేసి, ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారో చూడండి....ఫోటోలు
భారతదేశంలోని పెద్ద నగరాలలో ఇప్పటికే ఎన్నో సూపర్ మార్కెట్లలో కత్తిరించిన కూరగాయలు, ఆకుకూరలూ ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. ఇంటిదగ్గర కూరలూ, ఆకుకూరలూ తరిగే బాధ ఉండదు. తిన్నగా కొనుకున్న ప్యాకెట్టును బాండీలోవేసి కూర వండుకొవటం మాత్రమే పని. ఇప్పుడు భారతదేశం ఎఫ్.డి.ఐ(FDI...ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్)ను ప్రోత్సహిస్తున్నది కాబట్టి ఇంకొద్ది నెలలలో ఇలాంటి భారీ సూపర్ మార్కెట్లు పెద్ద నగరాలలోనే కాకుండా చిన్న చిన్న నగరాలూ, సిటీలలో కూడా వెలుస్తాయి.
ముక్కలుచేసిన వాటిని చేతితొ పరీక్షచేస్తున్నారు
కృత్రిమ మడుగులో కడుగుతున్నారు
కడిగిన సాలడ్
చెడిపోయిన వాటిని ఏరివేయటం
కడిగిన సాలడ్స్ జాలీలో పడేయటం
ఆ జాలీలో వాటిన మళ్లీ కడగటం
కడిగిన వాటిని వాషింగ్ మిషెన్ లాంటి దాంట్లో వేసి పూర్తిగా తడిని తేసేస్తారు
ప్యాకేజింగ్
ప్యాక్ చేసిన వాటిని స్టోర్ చెసే చోటు....అతిపెద్ద ఏర్ కండిషన్ గది
పాడైపోయిన సాలడ్స్ ఇక్కడకు వస్తాయి
అలాగే ఎర్ర సాలడ్
గిడ్డంగికి చేరుస్తారు...ఇక్కడి నుండి అమ్మే ధుకాణాలకు పంపబడతాయి
క్రెడిట్: అస్లాన్ అనే మాస్కో బ్లాగర్ కు
Monday, September 29, 2014
లండన్ నగరంలో అన్యులు......ఫోటోలు
లండన్ లో నివసిస్తున్న చాలామంది అసాధారణమైన, విచిత్రమైన వాటిని చూడటంలో అలవాటుపడిపోయేరు. ఒక రోజులో కొంతసేపైనా అసాధారణంగానే ఉంటుంది. ఎప్పుడూ కొత్తదనంగా కనిపించాలనకునే లండన్ నివాసస్తులు కూడా ఇండోజినెస్ అనే మర్మమైన అన్య సంతతి వారిలాగా వేషాధారణతో లండన్ నగరంలో తిరిగేరు.
ఏర్ షో ను ప్రయోగాత్మక ఆర్ట్ ఫిల్మ్ గా మార్చేరు.....వీడియో
రిపబ్లిక్ ఆఫ్ మోల్డోవా లోని చిసినౌ నగరములో ప్రతి సంవత్సరం ఏర్ షో జరుగుతుంది. ప్రపంచములోనే వైమానిక టెక్నాలజీలో పైచెయ్యి మాదేనని ఈ ఏర్ షో తో ప్రపంచానికి చూపుతూ వుంటారు. ఇక్కడ 2014 లో జరిగిన ఏర్ షో ను అలెక్స్ స్టాక్నోవ్ అనే చిత్రనిర్మాత అద్భుతమైన ఈ ఏర్ షో ను మరో అద్భుతంగా చేయాలనుకున్నాడు. చేసేడు. మీరే చూడండి.
Blue Skies from Alex Stacanov on Vimeo.
డర్రా ఆడం కేల్: పాకిస్తాన్లోని చట్టవిరుద్దమైన తుపాకీ ఉత్పాదకుల గ్రామం ....ఫోటోలు
పాకిస్తాన్ లోని ఈ గ్రామములోని ఒకే ఒక వ్యాపారం తుపాకులు తాయారుచేసి అమ్మటం. ఒకే ఒక రోడ్దుగల ఈ గ్రామములో రోడ్డుకు ఇరువైపులా వరుస క్రమంలో ఉంటాయి ఈ కొట్లు. ఈ కొట్లలో చిన్నవి, పెద్దవి తుపాకులు, ఆటోమేటిక్ తుపాకులు దొరుకుతాయి. ఈ గ్రామములో నివసిస్తున్న ప్రజలు షిప్ యార్డులలో దొరికే స్క్రాప్ మెటల్ తో చేతి పనిముట్లతోనే రోడ్డుకు వెనుక ఉన్న రూములలో వీటిని తయారుచేస్తారు. గ్రామ ప్రజలలో 75 శాతం మంది వీటి తయారీలోనే పనిచేస్తారు. ఈ తుపాకులను తాయరుచేయడానికి నైపుణ్యం గల వ్యక్తులుకావాలి. ఆ నైపుణ్యం వంశపారంపర్యంగా, తరాలవారిగా నేర్పబడింది. ఇక్కడ తయారయ్యే తుపాకులు అసలు తుపాకీలకు తీసిపోదు. ధర మాత్రం అసలు తుపాకీలకంటే భిన్నంగా, అతి తక్కువగా ఉంటుంది. ఈ తుపాకులే అటు ఆఫ్గనిస్తాన్లోకి మరియూ మరికొన్ని చోట్లకీ వెడుతోంది. తాలిబన్లలో ఎక్కువమంది ఈ తుపాకులూ, మందుగుండు వాడతున్నారు.
Subscribe to:
Posts (Atom)