ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Sunday, August 31, 2014
స్విజర్లాండ్ లోని పిశాచ వంతెన.....ఫోటోలు
యూరప్ ఖండములో ఉన్న ప్రాచీన వంతెనలలో చాలా వాటిని పిశాచ వంతెనలు అంటారు. దీనికి ముఖ్య కారణం వంతెనలు కట్టవలసిన చోటు అతి కష్టమైన ప్రదేశాలలో. సవాలు,హెచ్చరికతో కట్టవలసిన ఈ వంతెనలను శూరత్వముతో నిర్మించేరు. దీనికి వంతెన కట్టే నిర్మాణమూ, సంఘమూ ఎంతో సహకారం చేసినై.
ఈ క్రింద మీరు చూస్తున్న చిత్రాలు స్విజర్ లాండ్ లోని Teufelsbrücke అనే పేరున్న వంతెన(దీనిని పిశాచ వంతెన అని కూడా అంటారు). 1230 లో ఇక్కడ వంతెన కట్టడం చాలా కష్టం అని కీర్తినార్జించిన వంతెన నిర్మించే వ్యక్తులు చెబుతూ ఇక్కడ వంతెన కట్టాలంటే పిశాచాలవల్లే అవుతుందని తెలిపేరట. వెంటనే ఒక పిశాచి ఎదురపడి నేను వంతెన కట్టిస్తాను కానీ ఆ వంతెన మీద వెళ్లే మొదటి జీవిని నాకు బలి ఇవ్వాలి అని అడిగిందట. సరే నని చెప్పటంతో అక్కడ వంతెన నిర్మించబడింది. అక్కడున్న ప్రజలు తెలివిగా ఆ వంతెన మీదకు మొదటగా ఒక మేకను పంపించేరు. దీనికి ఆగ్రహించిన ఆ పిశాచి ఒక పెద్ద బండరాయితో ఆ వంతెనను బద్దలు కొట్టటానికి వస్తూండగా భగవంతుడు ఒక ముసలిదాని రూపంలో ఎదురుపడటంతో ఆ పిశాచి అది గమనించి పారిపోయిందట.
ఇది 1805 లో
ఇది 1934 లో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment