Thursday, August 7, 2014

పారాచూట్ తయారుచేసే కర్మాగారం....ఫోటోలు

రష్యా లోని ఇవనోవా నగరంలో ఉన్న ఈ కర్మాగారం మొదట్లో, అంటే 1924 లో బట్టలు తయారుచేసే కంపెనీగా మొదలుపెట్టేరు. ఆ తరువాత పారాచూట్ తయారుచేసే కర్మాగారముగా మార్చేరు.

పారాచూట్ అనగా సాధారణంగా గొడుగు వంటి ఆకారం కలిగిన పరికరం, దీనితో ప్రజలు లేదా వస్తువులు నెమ్మదిగా మరియు సురక్షితంగా గాలిలో తేలుతున్నట్లుగా చాలా ఎత్తుల నుండి, విమానం వంటి వాటి నుండి క్రిందకు దిగుతూ నేలకు చేరుకోవచ్చు. ఈ పారాచూట్ పదం ఫ్రెంచ్ పదాలైన పారర్ మరియు చూటీ పదాల నుండి వచ్చింది, పారర్ అర్థం రక్షించడం, చూటీ అర్థం సురక్షితంగా. దీని సృష్టికర్త లియోనార్డో డా విన్సీ ఒక రోజున మానవులు ఎగురగలరని నమ్మాడు.

పారాచూట్ అనునది తేలికైన గట్టిగా ఉన్న వస్త్రంతో తాయారుచేస్తారు. అనగా ఆ వస్త్రం వాస్తవానికి సిల్కుతో తయారు చెయబడినా ప్రస్తుతం సాధారణంగా నైలాన్ ను వాడుతున్నారు. పరిస్తితులను బట్టి పారాచూట్ ప్రజలు, ఆహారం, పరికరాలు, స్పేస్ క్యాప్సూల్లు, మరియు బాంబులు. వంటి వివిధ వస్తువులను పై నుండి వాతావరణం గుండా నెమ్మదిగా క్రిందికి దించుటకు వాడుతారు.

డ్రోగ్ పారాచూట్లు నేలకు సమాంతాంగా పోవు వాహనాలకు ఋణ త్వరణం కల్గించి వాటి వేగాన్ని తగ్గించుటకు లేదా వాహనాలకు స్తిరత్వం అందించుటకు వాడుతారు.దీనిని స్పేస్ షటిల్ భూమిపైకి దిగినపుడు దాని వేగాన్ని క్రమంగా తగ్గించుటకు కూడా వాడుతారు. పారాచూట్ అను పదం ఫ్రెంచ్ పదం అయిన "పారాసెట్" నుండి వచ్చినది. వాస్తవానికి గ్రీకు భాషనుండి దీని అర్థము తీసుకుంటే "ప్రజెక్ట్ అగనిస్ట్"(వ్యతిరేక దిశలో ప్రక్షిప్తం చేయుట), మరియు "చూట్" అనునది ఫ్రెంచ్ పదము దీని అర్థము "ఫాల్" (స్వేఛ్ఛా పతనం) . వాస్తవానికి పాచాచూట్ అనునది హైబ్రిడ్(సంకర) పదం. ప్రెంచి వైమానికుడు ఫ్రాంకోయిస్ బ్లాంచర్డ్(1753–1809) 1785 లో తెలిపిన ప్రకారం దీని అర్థం భాషా పరంగా "పతనానికి వ్యతిరేకంగా ప్రక్షిప్తం చేయుట".


No comments:

Post a Comment