Thursday, August 7, 2014

వీటిని కూడా తెలుసుకోండి.....ఫోటోలు

రష్యా కంటే బంగ్లాదేశ్ ఎక్కువ జనభా కలిగి యున్నది(Bangladesh Has A Larger Population Than Russia)
రష్యా నిడివి తొమ్మిది కాల మండలములను(టైమ్ జోన్)కలిగియున్నది. ఇంతేకాక రష్యా విస్తీర్ణం ప్లూటో కన్న పెద్దది. ప్రపంచములోనే అతిపెద్ద దేశమనిచ్ చెప్పబడే రష్యా దేశంలో జనాభా సంఖ్య 143 మిల్లియన్లు. అదే బంగ్లాదేశ్ లో(న్యూ యార్క్ నగరం కంటే కొంచం పెద్దది)జనాభా సంఖ్య 156 మిల్లియన్లు.

ఈఫిల్ టవర్ ను రెండుసార్లు అమ్మిన మనిషి:(A Man Sold The Eiffel Tower Twice)
విక్టర్ లస్టిగ్ అనే పేరుగల ఇతను అతి పెద్ద మోసగాడు. ఈఫిల్ టవర్ గురించి బాగా తెలుసున్న(అర్ధం)మనిషి. ఈఫిల్ టవర్ ఎంత త్వరగా తుప్పు పడుతుంది, ఈ టవర్ ను కాపాడుకోవటానికి ఎంత కర్చు అవుతోంది, 20 సంవత్సరాలకొకసారి టవర్ ను గట్టి పరచాలి లాంటి విషయాలు బాగా తెలుసున్న మనిషి. ఇతనికి మంచి ఐడియా తట్టింది. తాను ఒక ప్రభుత్వ ఏజెంటునని చెప్పి, ప్రభుత్వం ఇఫిల్ ట్వర్ ను ప్రవేట్ నిర్వాహకులకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. పర్యాటకుల దగ్గర నుండి బాగా డబ్బులు వసూలు చేసుకోవచ్చినని ఇద్దరి దగ్గర( ఒకరి దగ్గర 20,000 డాలర్లూ, ఇంకొకరి దగ్గర 50,000 డాలర్లూ)డబ్బు వసూలు చేసి ఆస్ట్రియా దేశానికి పారిపోయేడు. మోసపోయేమని తెలుసుకున్న ఇద్దరూ తమ తెలివితక్కువతనానికి సిగ్గుపడుతూ మోసపోయిన విషయాన్ని పోలీసులకు కూడా తెలియపరచలేదు

అంతరిక్షంలో కంటే మనిషి మెదడులోనే ఎక్కువ సినాప్సస్(నాడీ తంతుకూ కండర నారపోగుకూ వుండే అతుకులు)ఉన్నాయి:(There Is More Synapses In Our Brain Than There Is Stars In Our Galaxy)
ఆకాశం(అంతరిక్షం)లో సుమారు 200 బిల్లియన్ నక్షత్రాలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య అని మీరు ఒప్పుకుంటారు. కానీ మనిషి మెదడులో, అందులోనూ 3 ఏళ్ల పసిపిల్లలో ఒక ట్రిల్లియన్ అతుకులు, పెద్ద వారిలో 500 బిల్లియన్ అతుకులు ఉన్నాయని న్యూరో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కొత్త జార్జియా నగరంలో ఎక్కడో ఒక చోట పేలని న్యూక్లియర్ బాంబు ఉందట(Somewhere Near Georgia There Is An Unexploaded Nuclear Bomb)
1958 లో అమెరికాకు చెందిన ఒక ఏర్ ఫోర్స్ పైలట్ తన విమానం లో ఏర్పడ్డ లోపం వలన ఆ బాంబును సముద్రంలో వదిలేడు. 3 టన్నుల బరువున్న ఈ బాంబు కోసం తీవ్రంగా గాలించేరు. కానీ అది దొరకలేదు. ఆ బాంబు తానుగా పేలదు కాబట్టి దాని వలన ఎటువంటి ప్రమాదంలేదని వెదకటం వదిలేసేరు.

మొదటి పిజ్జా రెస్టారంట్:(Period Of Cleopatra Is Closer To The First “Pizza Hut” Than It Is To The Time Of Pyramids)
ఈజిప్ట్ లో పిరమిడ్లను 2250 BC లో మొదలు పెట్టి 2490 BC లో ముగించేరు. ఈజిప్ట్ చివరి రాణి(ఫారా)కిలియోపాట్రా 69 BC లో పుట్టి 30 BC లో చనిపోయేరు. 1958 లో కన్సాస్ లో మొదటి పిజ్జా హట్ నిర్మించేరు. అంటే కిలియోపాట్రా చనిపోయిన 500 సంవత్సరాల తరువాత పిజ్జా హట్ నిర్మించబడింది. అంటే పిరమిడ్ల కంటే, కిలియోపాట్రా కాలమే పిజ్జాకు దగ్గర.

సాంకేతికముగా ఉత్తర కొరియా మరియూ ఫిన్లాండ్ల మధ్య ఒక దేశమే ఉన్నది. (Technically North Korea And Finland Are Separated By Only One Country)
అదే రష్యా.

నాజీల దగ్గర నుండీ మరియూ పాశ్చ్యాత్త దేశాల నుండి బహుమతి అందుకున్న సిపాయి:(A Solider Received Awards From Both Allies and Nazis in WWII)
జాన్ పుజోల్ గర్సియా ఒక డబుల్ ఏజెంట్. మొదట్ బ్రిటీష్ దేశానికి పనిచేసేడు, ఆ తరువాత జర్మనీ దేశానికి పనిచేసేరు.

కాల్కులస్ కనుగొనడానికి ముందే హర్వర్ద్ విశ్వవిద్యాలయం మొదలుపెట్టబడింది:(Harvard University Was Founded Before Calculus Was Discovered)
1636 లోనే హర్వర్ద్ విశ్వవిద్యాలయం నిర్మించబడింది. 50 సంవత్సరాల తరువాత, అంటే 1684 లో కాల్కులస్ కనుగొన్నబడ్డది.

No comments:

Post a Comment