Friday, August 15, 2014

ప్రపంచములో ప్రస్తుత సమస్యలు....ఫోటోలు

యుద్దాలు మరియూ తీవ్రవాదం
యుద్దాలు సర్వ సాధారణమైపోయింది. అందులోనూ 3 వ ప్రపంచ దేశాలలో(పెట్టుబడిదారీవిధానం కలిగిన దేశాలు మరియూ సమాజవాద సిద్దాంతం కలిగినదేశాలు...ఇవి 2 ప్రపంచ భాగాలుగా విభజించబడి ఉన్నాయి. ఈ రెండింటిలోనూ కలవని దేశాలు 3 వ ప్రపంచ దేశాలుగా గుర్తించబడుతున్నాయి(తర్డ్ వరల్డ్ కంట్రీస్) యుద్దాలు ఎక్కువగా జరుగుతున్నాయి.అంతర్యుద్ధం,నిర్దిష్టజాతి యుద్దం,ప్రచ్ఛన్నయుద్ధం మరియూ గుర్తింపు యుద్దాలు మానవ నాగరికతను ద్వంసం చేస్తున్నాయి. మొదటి ప్రపంచ యుద్దం, రెండవ ప్రపంచ యుద్దం మరియూ శ్రీలంక మరియూ వియత్నాంలలో జరిగిన నిర్దిష్టజాతి యుద్దం, ఇప్పుడు జరుగుతున్న ఇరాక్, సిరియా యుద్దాలు ఎంత నష్టం ఏర్పరుస్తున్నాయో అందరికీ తెలిసినదే. దీనికి తోడు ప్రపంచమంతటా వ్యాపించిన తీవ్రవాద దాడులు ప్రపంచం మొత్తాన్ని కలవర పరుస్తోంది.

స్థూలకాయం
21వ శతాబ్దపు అతిపెద్ద సమస్య స్థూలకాయం. వివిధ వ్యాధులు చుట్టు ముట్టడానికి ఒక ముఖ్యమైన కారణం అవడమే కాకుండా అనవసరమైన మరణాలకు రెండవ ప్రధాన కారణమవుతోంది. అభివృద్ధి చెందిన దేశాలలో పోషకాహార లేమికి రూపం ఇది. ఈ సమస్య ఎంతమేరకు వ్యాపించిందో నిర్ధిష్టంగా తెలియకపోయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలలో 20-40 శాతం మంది వయోజనులు, 10-20 శాతం మంది పిల్లలు, యువత దీని బారిన పడుతున్నారని అంచనా.

మంచి(తాగు)నీరు
తాగు నీరు లేక సంవత్సరానికి 1.4 మిల్లియన్ పిల్లలు చనిపోతున్నారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా మంచి నీరు కోసం కష్టాలు పడుతున్నారు.

వాతావరణ మార్పు
వాతావరణ మార్పు తనకు తానుగా ఏర్పడటం లేదు. మనుష్యుల వలనే వాతావరణ మార్పిడి జరుగుతోంది. దీనివలన భూమండల ఉష్ణోగ్రత పెరిగింది. దీని వలన మంచుకొండలు కరిగి సముద్రపు నీటిమట్టాన్ని పెంచొతోంది. దీని వలన రాబోవు కాలంలో సముద్రతీరాన ఉన్న పెద్ద పెద్ద నగరాలు మునిగిపోయే పరిస్తితి రాబోతోందట.వాతావరణ మార్పు వలన వ్యాధులూ, కరువు, తీవ్రమైన ఎండ, తీవ్రమైన చలి, భూకంపాలూ ఏర్పడవచ్చునని తెలుస్తొంది.

శరణార్ధులు
ప్రపంచవ్యాప్తంగా శరణార్ధులు సంఖ్య 2013 లో 10.4 మిల్లియన్లుగా చెబుతున్నారు. ఈ శరణార్ధులకు ఏ దేశపు గుర్తింపూ ఉండదు. యుద్దాలవలన వలస వెడుతున్న శరణార్ధులు తాము కష్టాల భారి పడటమే కాకుండా వల్స వెళ్లే దేశాలకు కూడా భారం అవుతున్నారు.

నిరుద్యోగం
ఇది అతిపెద్ద సమస్యగా మారింది. 2013 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 73 మిల్లియన్ల ప్రజలు నిరుద్యోగులుగా ఉన్నారు. చదువు మరియూ నైపుణ్యం తగ్గినందువలనే ఇంతమంది నిరుద్యోగులుగా ఉన్నారని చెబుతున్నారు.

తీవ్ర ఆదాయ వ్యత్యాసం
ఇది కూడా అతిపెద్ద సమస్యగా తయారయ్యింది. ఒక దేశ ఆర్ధీక పరిస్థితి దెబ్బ తినడానికి ముఖ్యమైన కారణం ఇదే. మామూలుగా అభివ్రుద్ది చెందుతున్న దేశాలకే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు అభివ్రుద్ది చెందిన దేశాలలో కూడా వ్యాపించింది. దీని వలన ప్రపంచ ఆర్ధీక పరిస్థితే బలహీనంగా ఉంటోంది. మధ్య తరగతి కుటుంబాల పెట్టుబడి బాగా తగ్గిపోయింది. ఆ యా దేశాల ఆదాయపు పన్ను పధకాలు కొంతదాకా ఈ సమస్యను కొంతవరకు పరిస్కరించవచ్చు.

పేదరికము
ప్రపంచంలో చాలామంది మంచి ఆహారాన్ని రోజుకు నాలుగు లేక ఐదు సార్లు తింటున్నారు. కానీ ప్రపంచములోని కొన్ని ప్రదేశాలలో మురుగు నీరును తాగి ఆకలి నింపుకుంటున్నారు. పేదరికం తనకు తానుగా ఉదయించలేదు. దేశ సంపదను ప్రజలకు సరిసమముగా పంచకపోవటమే దీనికి ముఖ్య కారణం. కొంతమంది వ్రుధా చేస్తున్న ఆహారాన్ని పంచిపెడితేనే పేదరికంలో ఉన్నవారి ఆకలి తీరిపోతుంది.

జనభా పెరుగుదల
మీరు మార్కెట్టుకు వెడితే అక్కడ మీకు కావలసినది దొరకదు గానీ అక్కడ మీకు బోలెడంతమంది జనం మాత్రం కనబడతారు. ప్రపంచ వనరులు మితంగానే ఉన్నాయి, పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపోయేటంత వనరులు లేవు. వనరుల కొరత, ఉన్న వనరులను వేరే దానికోసం ఉపయోగించుట మరియూ పెరిగే ప్రపంచ జనభా ఈ సమస్యను మరింత పెద్దది చేస్తోంది. అభివ్రుద్ది చెందుతున్న దేశాలలోనే జనభా సంఖ్య అత్యధికంగా ఉన్నది. కారణం జనభా పెరుగుదలను ఆపే పధకాలను సరిగ్గా అమలు చేయకపోవడమే దీనికి ముఖ్య కారణం. ప్రస్తుతం 7 బిల్లియన్ల జనభా కలిగిన ఈ ప్రపంచంలో, జనభా కట్టుబాటుకు ఎన్ని పధకాలు వేసినా సంవత్సరానికి 1.14 శాతం పెరుగుతూనే ఉన్నది.

మాదక ద్రవ్యాల దుర్వినియోగము
ఎంతో మంది యువత వీటికి బానిసలైపోతున్నారు.ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అనచలేకపోతున్నారు. ఈ దురలవాటు వలన సమాజం దెబ్బతింటోంది.

పై చెప్పినివే కాక ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ పైన చెప్పినవి అతి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు

No comments:

Post a Comment