Saturday, August 9, 2014

నగరాన్ని కైవసం చేసుకున్న జింకలు....ఫోటోలు

జపాన్ దేశంలోని నర అనే నగరాన్నీ జింకలు కైవసం చేసుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నగరంలో ఎటుచూసినా జింకలు కనబడుతూ ఉంటాయి. సుమారు 1200 జింకలు ఈ నగరంలో ఉన్నాయి. రోడ్లపైన, కొట్ల దగ్గర, పార్కులలో ఎక్కడపడితే అక్కడ కనబడతాయి.

ఈ నగరంలో జింకలక గురించి ఒక కధ ఉంది. అందుకే అక్కడి ప్రజలు వాటిని ఇబ్బందిగా అనుకోరు. పూర్వం ఈ నగరానికి, ఈ నగరాన్ని కాపాడటానికి ఒక తెల్ల జింకను ఎక్కి ఒక దేముడు వచ్చేరట. అందువలన గత 1300 సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు ఇక్కడి జింకలను పవిత్రమైనవిగానూ, దైవసంబంధమైనవిగానూ భావిస్తారట. ఇక్కడి జింకలను చంపటం అతిపెద్ద నేరంగా పరిగణించి, నేరానికి ఉరిశిక్ష వేసేవారట. 1637 లో ఈ నేరాన్ని తీసేసి, ఇక్కడి జింకలను జాతీయ నిధులుగా ప్రకటించేరు. ఏది ఏమైన ఇక్కడి ప్రజలు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న జింకలను పవిత్రంగానే భావిస్తున్నారు.


No comments:

Post a Comment