Tuesday, August 26, 2014

మానవులు సముద్రాలకు చేస్తున్న ద్రోహం.....ఫోటోలు

ప్రతి సంవత్సరం 240 మిల్లియన్ మెట్రిక్ టన్నుల చెత్తను సముద్రంలో వేస్తున్నాము
ప్రతి సంవత్సరం చేపలు పట్టేవారు 77.9 మిల్లియన్ మెట్రిక్ టన్నుల చేపలను సముద్రం నుండి పడుతున్నారు. ఇది చాలా ఎక్కువ. దానికి బదులుగా సముద్రంలోకి ఎంత చెత్త తోస్తున్నామో చూస్తే ఇది మనం పట్టే చేపలకన్నా 3 రెట్లు ఎక్కువ.

విషపూరిత ఆహారాలు
కుళ్ళిపోయిన, ఎక్కువైన ఆహార పధార్ధాలను కూడా సముద్రంలోనే కలుపుతున్నారు. ఈ ఆహారం తినే చేపలను మళ్ళీ మనుష్యులే తింటున్నారు. దీని వలన అనేక రకాల హానికరమైన వ్యాధులకు గురౌతున్నారు.

సముద్రతీరంలో ఒక రోజుంటే అది ప్రాణాంతకం
ప్రతి సంవత్సరం వేలకొలది సముద్ర తీరాలను మూసేస్తున్నారు. కారణం, ఆ సముద్ర నీరు ఎక్కువగా కాలుష్యమైనదని. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వారి లెక్కల ప్రకారం సంవత్సరానికి 3.5 మిల్లియన్ ప్రజలు సముద్రంలో నీరాడటం వలన అనారోగ్యానికి గురౌతున్నారట. ఇంతవరకు 20,000 సముద్రతీరాలను మూసేసేరు.సముద్రతీర స్నానాలవలన వచ్చే 4000 రకాల వ్యాధులను గుర్తించేరు.

చమురుతెట్టె నిజాలు
2010లో BP కంపెనీ వారు ప్రమాద వసత్తు 4 నుండి 5 మిల్లియన్ బారెళ్ల చమురును సముద్ర నీరులో కలిపేరు. ఇది అత్యంత భయంకరమైన పర్యావరణ ప్రమాదం. సముద్ర నీటిలో ఉన్న చమురు శాతంలో ప్రమాదవసాత్తు కలిసే చమురు 7.7 శాతమే. మిగిలిన 92.3 శాతం( సుమారు సంవత్సరానికి 220 మిల్లియన్ బ్యారెళ్ల చమురు) పడవలూ, ఓడలూ వదిలిపెట్టే వ్రుధా చమురే ఎక్కువ.

సముద్రాలను విషపూరిత చెత్త ప్రదేశాలుగా వాడుకోవడం
1970 కి ముందు యుద్ద ఆయుధాలలో వాడే ముస్టర్డ్ గ్యాస్ మరియూ రేడియో యాక్టివ్ గ్యాస్ ల నుండి వెలువడిన విసర్జిత పధార్ధాలను బ్యారల్స్ లోకి నింపి, అలా నింపిన వేలకొలది బ్యారల్స్ ను సముద్రంలోకి విసిరేసేరు. ఇవి ఇంకా సముద్రాలలోనే ఉన్నాయి. దీనివలన సముద్ర నీటికి ఏర్పడుతున్న కాలుష్యం ఎంతో లెక్క కట్టలేము.

సముద్ర సంబంధమైన శిథిలాల ప్రభావం
సముద్రాలలో ఏర్పడే ప్రమాదాలో మానవ శరీరాలే కాకుండా, ఎన్నో రకాల ప్రాణులు మరియూ వస్తువులు నీటిలోనే ఉండిపోయేయి. ఎక్కువగా ప్లాస్టిక్ సంభందిత వస్తువులు ఉన్నాయట. ఇది కాకుండా చనిపోయే సముద్రపు ప్రాణుల శంఖ్యను కొన్ని లక్షలుగా నిర్ణయించేరు. వీటివలన నీటికి ఏర్పడే కాలుష్యం అంచనా వేయలేకపోతున్నారు.

సముద్ర నీటి ఆమ్లీకరణ
నేల నుండి వెలువడుతున్న కార్బండ యాక్సైడ్ వాయువును ఎక్కువగా తనలోకి తీసుకొనుటవలన అముద్ర నీటి ఆమ్లీకరణ తగ్గుతోంది. దీని వలన సముద్రపు కెమిస్ట్రీ నే మారిపోయిందని, దీనిని ఎప్పటికీ సరిచేయలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సముద్రంలొ డెడ్ జోన్
సముద్రాలలో డెడ్ జోన్ అని పిలువబడే చోట్లలో సముద్రపు నీటి లో ప్రాణ వాయువు తక్కువగా ఉన్న చోట్లన్నమాట. అక్కడ సముద్రపు జీవులు కూడా బ్రతకలేవు. ఇలాంటి డెడ్ జోన్లు ఇప్పటిదాకా సుమారు 400 దాకా కనుగొన్నారు. అంటే న్యూజీలాండ్ దేశమంత పెద్ద విస్తీర్ణం అవుతుంది. దీని వలన సుమారు 1.3 మిల్లియన్ల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి తగ్గుతోంది.

చెత్త దీవులు
సముద్రపు నీటిలో ఉండే కరెంటు నీటిని ఒకే దిశగా తీసుకు వెడుతుంది. సముద్రంలో చెరుతున్న చెత్తనంతా ఆ దిశగానే తీసుకు వెళ్లి ఒకే చోట చెరుస్తోంది. అల్ల ఒకే చోట చెరిన చెత్తనే చెత్త దీవిగా పిలుస్తున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో అత్యంత సముద్ర చెత్త దీవి ఉన్నదట.

భౌగోళిక శాఖోపశాఖలు
"వెల్త్ అకౌంటింగ్" అనే మాట ఇంతకు ముందు విన్నారా? ఏమీలేదు, ఒక దేశ ప్రక్రుతి వనరుల విలువను శాస్త్రొక్తమైన పద్దితిలో గణించడాన్నే వెల్త్ అకౌంటింగ్ అంటారు. సముద్ర కాలుష్యం వలన ఆ దేశాలకు ఏర్పడుతున్న నష్టాల విలువను అందులోనుండి తీసేస్తున్నారు. అప్పుడు ఆ దేశానికి నిజమైన విలువ, అభివ్రుద్దీ తెలుస్తోంది. ఇదొక్కటే కాకుండా భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడం వలన కార్బండ యాక్సైడ్ ఎక్కువై దాని వలన సముద్ర జీవుల నష్టం అంచనావేస్తే నష్టం అపారంగా కనబడుతోంది.

No comments:

Post a Comment