Friday, August 29, 2014

ప్రజలు అంతర్జాలమును ఎక్కువగా వాడుతున్న దేశాలు.....ఫోటోలు

ఐస్ లాండ్
దేశ జనభాలో 96.4 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. దీనికి వారు చవుకైన మరియూ పునరుద్ధరణీయతతో తయారుచేయబడుతున్న కరెంటును వాడుతున్నారు. ఎందుకంటే వారు ఇంటర్నెట్ కేబుళ్లను అత్యంత సన్నటి ద్వారము ద్వారా పొందుతున్నారు. అందులోనూ హై స్పీడ్ ఇంటెర్నెట్ పొందగలుగుతున్నారు. భవిష్యత్తులో మిగిలిన దేశాలకు వీరు ఊదాహరణగా ఉండబోతారు.

నార్వే
దేశ జనభాలో 95 శాతం ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ దేశమే ప్రపంచములోని మొదటి ఆంగ్ల భాషే మాట్లాడని దేశం. ఈ దేశములో మారుమూల ప్రదేశాలకు కూడా ఫైబర్ వైర్లతో అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడ్ ఇవ్వబడింది.

స్వీడన్
ఈ దేశ జనభాలో 94 శాతం ఇంటర్నెట్ వసతి కలిగియున్నారు. ప్రపంచములోనే అంతర్జాల సెన్సార్ షిప్ లేని దేశం ఇదే. పైరేట్ బే అనే ఒక అంతర్జాల సంస్థ ఈ దేశంలో అంతర్జాల స్వాతంత్రయం గురించి ఎక్కువగా ప్రచారంచేసేది. అయితే ఈ సంస్థ యజమాని పీటర్ సుండే ను అనేక కాపీరైట్ లా వాయ్ లేషన్స్ క్రింద ఖైదుచేసేరు.

నెదర్లాండ్స్
దేశ జనభాలో 93 శాత ప్రజలు ఇంటర్నెట్ వసతి కలిగియున్నారు. ఫైబర్ కేబుల్ ఇంటర్నెట్ మాతమే వాడుతున్న ఈ దేశంలో అంతర్జాల స్పీడ్ అత్యంత వేగంగా ఉంటుంది. దేశ ప్రజలందరూ (డబ్బుతో ప్రమేయం లేకుండా) నిష్పాక్షిక అంతర్జాలం కలిగి ఉండాలని నిర్ణయించుకున్న దేశం.

డెన్మార్క్
దేశ జనభాలో 93 శాతం మంది అత్యంత వేగమైన డెస్క్ టాప్ మరియూ మొబైల్ ఇంటర్నెట్ కలిగియున్నారు.

ఫిన్ లాండ్ >
దేశ జనభాలో 91 శాతం మంది అత్యంత వేగమైన ఇంటర్నెట్ వసతి కలిగి యున్నారు. అత్యంత వేగమైన ఇంటర్నెట్ కలిగి యుండటం మానవ హక్కు అని ప్రకటించిన దేశం ఇది. ఈ దేశంలో ఏ సంస్థ అయినా ఇంటర్నెట్ వసతులు కలిపిస్తామని ముందుకువస్తే సెకెండ్ కు ఒక మెగా బైట్ స్పీడ్ ఇవ్వగిలిగితేనే వ్యాపారం పెట్టుకోవడానికి అనుమతిస్తారు. 2015 లోపు ఒక సెకెండుకు 1000 మెగా బైట్ల స్ప్పిడు అందజేయాలని నిర్ణయించుకున్న దేశమిది.

No comments:

Post a Comment