Monday, August 11, 2014

రక్షా బంధన రోజు సహోదరి గీత గారు అందించిన అద్భితమైన కవిత....మీకోసం


ప్రతిదానికీ


రెండు కోణాలున్నట్లే...

ఆడపిల్లలని

అనురాగాల పెన్నిధులుగా

పూజించే మగవాళ్ళూ ఉంటారు,

అమృత నిధులుగా భావించి,

కొల్లగొట్టాలనుకునే దొంగవాళ్ళూ ఉంటారు.



తన గౌరవాన్నే కాదు,

తోడబుట్టిన అక్కచెల్లెళ్ళ

అభిమానాల్ని కాపాడడం

అన్నల బాధ్యత అని గుర్తుచేస్తూ

వచ్చిన ఈ రక్షా బంధన రోజు...


ప్రతి మగవానిలోని అన్నయ్యతనాన్నీ

మృగత్వం చాటునున్న మానవత్వాన్నీ

వెలికి తీసుకు రావాలని...

గుండె నిండుగా కోరుకుంటూ,

రక్షా బంధన శుభాకాంక్షలతో...


ఒక సగటు

భారతీయ సోదరి

గీతిక

http://premalo-manam.blogspot.in

1 comment: