Tuesday, August 5, 2014

యాత్రీకుల వసతి కొసం ఒక లక్ష ఏర్-కండిషనర్లతో గుడారాల నగరం....ఫోటోలు

పడమటి సౌదీ అరేబియా లోని పవిత్రమైన మెక్కా క్షేత్రానికి 8 కిలోమీటర్ల దూరంలో మినా అనే లోయ ప్రాంత నగరం ఉన్నది. ఇక్కడ యాత్రీకుల విశ్రాంతి వసతికై 20 చదరపు కిలొమీటర్ల దూరం వరకు అగ్ని నిరోధక గుడారాలు ఏర్పాటుచేసేరు. వరుసగా, అందంగా నిర్మించిన ఈ ఒక లక్ష గుడారాలలో సుమారు 30 లక్షల మంది యాత్రీకులు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ ఒక లక్ష గుడారాలూ ఒక లక్ష ఏర్-కండిషనర్లతో అమర్చబడినై.

పూర్వం, యాత్రీకులు తమ సొంత గుడారాలను మోసుకు వచ్చి, ఈ చోట అమర్చుకుని విశ్రాంతి తీసుకుని, వెళ్లేటప్పుడు గుడారాన్ని తీసుకు వెళ్లేవారు. 1990 లో సౌదీ ప్రభుత్వం యాత్రీకుల కష్టాలు చూడలేక, ఈ చోట గుడ్డ గుడారాలను నిర్మించేరు. అయితే 1997 లో ఈ గుడ్డ గుడారాలలో అగ్ని ప్రమాదం సంభవించి 337 మంది చనిపోయేరు. ఆ తరువాత సౌదీ ప్రభుత్వం అగ్ని నొరోధక గుడారాలను ఏర్పాటు చేసి, ఆ గుడారాలకు ఏర్-కండిషనర్లను అమర్చేరు.


No comments:

Post a Comment