ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Sunday, August 24, 2014
ఖ్రైస్తువ గుడిలో మానవ ఎముకలతో కళ(ఆర్ట్)గా అలంకరణ.....ఫోటోలు
చెక్ రిపబ్లిక్ (మధ్య యూరప్ లోని ఒక భూపరివేష్టిత దేశం. దీని ఈశాన్యాన పోలండ్, పశ్చిమాన జర్మనీ, దక్షిణాన ఆస్ట్రియా మరియు తూర్పున స్లొవేకియా దేశాలు ఎల్లలుగా గలవు. దీని రాజధాని మరియు పెద్దనగరం ప్రేగ్. చెక్ రిపబ్లిక్ నందు ప్రాచీన బొహిమియ, మొరెవియ యొక్క భూభాగాలు మరియు సైలీసియ యొక్క కొంత భూభాగం కలదు)లోని సెడ్లెక్ ఒసేరే అనే గ్రామములో మానవ ఎముకలతో అలంకరించబడ్డ ఒక ఖ్రైస్తువ గుడి వున్నది. దీనిని ఒక పుణ్య స్థలంగా చెబుతారు. బాగా ధనవంతులైన వారు చనిపోయేక తమ శరీరాలను ఇక్కడకు తీసుకువచ్చి పూడ్చాలని వీలునామాలు రాస్తారట. కారణం: 1278 లో హెన్రీ అనే అతను పాలస్తీనియాలోని జెరూసలం వెళ్ళి జీసస్ ఖ్రైస్తు ను శిలువపై ప్రతిమను చేసిన చోటు నుండి మట్టిని తీసుకువచ్చి చెక్ రిపబ్లిక్ లోని సెడ్లెక్ ఒసేరే లోని ఈ చోట పూడిచిపెట్టడట. అందుకని అక్కడ కనుక తమ శరీరాలు సమాధి అయితే పుణ్యలోకాలకు వెళ్లవచ్చునని నమ్ముతారు. పేదలు చనిపోయిన తరువాత తమ శారీరంలోని ఎదో ఒక ఎముకను ఈ ఖ్రైస్తువ గుడికి పంపిస్తారట. అలా పంపించిన వారి 70,000 మంది ఎముకలతో ఈ గుడిని అలంకరించేరు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment