Wednesday, August 27, 2014

బొమ్మలకోక ఆసుపత్రి....ఫోటోలు

మీరు చదివింది కరెక్టే. బొమ్మలకు ఒక ఆసుపత్రి. ఇది ఆస్త్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్నది. ఈ రోజుల్లో పిల్లలతో బయటకు వెళ్లొస్తే వారికి ఆడుకోవటానికి ఒక బొమ్మ కొనుక్కురావలసిందే. అలాగే పాత బొమ్మలను(పాడైపోయిన, విరిగిపోయిన)బాగుచేయిద్దామనే ఆలొచన ఎవరికీ కలగదు. విరిగిపోయిందా లేక పాడైపోయిందా? పోతే పోనీ ఇంకొకటి కొందములే అనిపిస్తుంది

కానీ, ఆస్ట్రేలియా నగరమైన సిడ్నీలో పాడైపోయిన బొమ్మలను రిపేరు చేయడానికి ఒక ఆసుపత్రి ఉందంటే నమ్మబుద్దికావటంలేదు. అందులోనూ ఈ ఆసుపత్రి వంద సంవత్సరాలుగా ఉన్నదంటే అంతకన్న ఆశ్చర్యం ఇంకోకటిలేదు. ఈ ఆసుపత్రి తన 101 వ పుట్టిన రోజు జరుపుకుంటోందంటే అక్కడి ప్రజలు వారు కొన్న బొమ్మలకు ఎంత విలువనిస్తున్నారో అర్ధమౌతోంది. 1913 లో Mr Harold Chapman Sr చే అనుకోకుండా స్థాపించబడ్డ ఈ ఆసుపత్రి ఇప్పుడొక అతిపెద్ద బొమ్మల ఆసుపత్రి గా మారింది.


No comments:

Post a Comment