Wednesday, August 20, 2014

ప్రపంచానికే యోగాను పరిచయంచేసిన యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ మృతి...ఇవే ఆయనకు మీకొసం అందించే శ్రద్దాంజలి...ఫోటోలు

నా మొట్టమొదటి బ్లాగు http://splendorofyoga.blogspot.in ప్రారంభించటానికి కారణం ఈయనే. ఆ తరువతే మిగిలిన నా బ్లాగులన్నీ ప్రారంభించేను.

ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువు, అయ్యంగార్ యోగా విధానాన్ని ఆవిష్కరించిన ప్రముఖ యోగా గురువు పద్మవిభూషణ్ బీకేఎస్ అయ్యంగార్ బుధవారం కన్నుమూశారు. ఆయనకు వయ్ససు 95 యేళ్లు. 1918లో కర్ణాటకలోని బెళ్లూర్‌లో బీకేఎస్ అయ్యంగార్ జన్మించారు. ఆయన పూర్తిపేరు బెళ్లూర్ కృష్ణమాచార్య సుందరరాజన్ అయ్యంగార్. 1937 నుంచి పుణెలో యోగా ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. మొదట 1975లో యోగా విద్య ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించి.. అటు తర్వాత దాన్ని అయ్యంగార్ స్కూల్ ఆఫ్ యోగా కేంద్రంగా మార్చారు. ఇందులో అయ్యంగార్ యోగా అంటూ ప్రత్యేక పద్ధతిని ఆయన ప్రవేశపెట్టారు. పుణెలోని ఈ కేంద్రానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు వచ్చి.. యోగాలో శిక్షణపొందేవారు.ఈ కేంద్రం వివిధ దేశాల్లో 100 శాఖలుగా విస్తరించింది.....ప్రపంచంలో చాలా మందికి ఆయన యోగాను పరిచయం చేశారు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.


No comments:

Post a Comment