Wednesday, August 20, 2014

అత్యంతవేగమైన ఇంటెర్నెట్ కనెక్షన్లున్న దేశాలు....ఫోటోలు

అత్యంత వేగంగా టెక్నాలజీ పెరుగుతోందని అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు కొత్త విశేషతతో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు మరియూ లాప్టాప్ లూ మాత్రం మనదేశంలోకి తెస్తున్నారు, అమ్ముతున్నారు. కానీ దానికి కావలసిన ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడును (వైర్ మూలంగానో లేక వైర్ లెస్ గానో)తేవడానికి ఆలస్యం చేస్తున్నారు. మనదేశం లో ఇంటర్నెట్ ను అందించే ప్రైవేట్ కంపెనీలు 10 ఎం.బి స్పీడుకే ఖరీదు ఎక్కువచెబుతున్నారు. 2జి కేటాయింపు విషయంలో ఎంత పెద్ద స్కాము చోటుచేసుకుందో మనందరికీ తెలుసు. అందుకే మన దేశంలో కంప్యూటర్లూ, మొబైల్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నా ఇంటర్నెట్ కనక్షన్ తీసుకునే విషయంలో ప్రజలు ఆలొచనకు ఎక్కువ టైము కేటాయిస్తున్నారు. ఎందుకంటే ఖరీదు, ఖరీదుకు సరిపోయే స్పీడు లేకపోవటమే. కానీ ప్రభుత్వం మాత్రం మనతో ప్రతి పనినీ అంతర్జాలంలో చేయమని సలహాలిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వ సేవలలోనే(బాంకింగ్,రైల్వే, కరెంటు బిల్లులు) స్పీడు తక్కువగా ఉందంటూ ఆలస్యం చేస్తున్నారు.

ఈ క్రింద మీరు చూస్తున్న దేశాలలో సరాసరి ఇంటర్నెట్ స్పీడు ఎంతుందో చూడండి. ఒకసారి మౌస్ క్లిక్ చెస్తే, మరొసెకెండ్ పూర్తవకముందే మనకు కావలసిన పని జరిగిపోతుంది. అదే గనుక మనకు కూడా దొరికితే మనం కూడా ఎంతో అభివ్రుద్ది పొందుతాం.

Singapore....30.7 Mbits/second

Israel.......30.9 Mbits/sec

Bulgaria.....32.1 Mbits/sec

Switzerland...32.4 Mbits/sec

Belgium.......32.7 Mbits/sec

Romania......37.4 Mbits/ sec

Latvia....... 37.5 Mbits/sec

Japan....42.2 Mbits/sec

South Korea.....48.8 Mbits/sec

Hong Kong....54.1 Mbits/sec

No comments:

Post a Comment