Monday, August 11, 2014

ఈ అలవాట్లను విడిచిపెట్టడం చాలా కష్టం!....ఫోటోలు

టీవీ చూస్తూ తినడం:
తినేవాటి మీద శ్రద్ద పెట్టుకుని తింటేనే అవి వొంటపడతాయి. ఇలా మాత్రమే ఆ తిండి మనకు ఆరోగ్యం చేకూరుస్తుంది. పిల్లల్లు టీవీ చూస్తూ తినడం తల్లితండ్రులను చూసేననని గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని సైన్స్ కూడా దృవీకరించింది.

గోళ్లు కొరొక్కోవడం:
గోళ్లు కొరొక్కోవడం అత్యంత హాని కరం. ఆదుర్దాగా ఉన్నప్పుడో, ఆందోళన చెందుతున్నప్పుడో గోళ్లు కొరుక్కుంటారని మనోతత్వ శాస్త్రం చెబుతోంది. గోళ్లు కొరుక్కోవడం చూసి మన మెంటల్ స్టేటస్ ను ఇట్టే కనిపెట్టేవారు ఊన్నారట.

నేటి పనిని ఆలస్యపరచుట:
ఎప్పటి పనిని అప్పుడే చేయడం ఉత్తమమ. ఏ పనినైనా చేయడానికి ఆలస్యం చేస్తే అది మనల్ని ఇబ్బందిలో పెడుతుంది. అనవసర ఆందోళనకు మనల్ని గురిచేస్తుంది.అయితే చాలామంది పనులను వాయిదా వేస్తూ ఉంటారు.

తిట్టుట:
సినిమాలలోనూ, టీవీలలోనూ ఇలాంటివి చూస్తే మనకి ఆనందం కలగవచ్చు. కానీ నిజ జీవితంలో ఇది మనకి కష్టాలనూ, దుఃఖంను కలిగిస్తుంది.

బబుల్ గం విరుచుట:
చిన్న వయసులో బుడగలు చేయడం, ఈలలు వేయడం చిన్నతనపు హక్కులుగా చెప్పవచ్చు. కానీ అదే పెద్ద వయసులో ఈ అలవాట్లు మనకు హాని కలిగిస్తాయి. ఈలలు వేయడం నానేయగలిగినా, బబుల్ గం తో బుడగలు చేయడం మానేయడం కష్టం. ఇది మనలోని బద్దకానికి గుర్తుగా భావిస్తారట.

అంతరాయం కలిగించుట:
జీవితంలో మనకు చాలా అంతరాయాలు కలుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది ఎందుకనో ఎప్పుడూ పక్కవారికి అంతరాయం కలిగిస్తూనే ఉంటారు.ఇది చాలా చెడ్డ అలవాటు.

వ్యర్థప్రసంగం:
మరొకరి గురించి లేనిపోని వ్యర్థప్రసంగాలు చేసుకోవడం అవతలివారికి ఎంత హాని కలిగిస్తుందో, అంతే హాని వ్యర్థప్రసంగం చేసే వారికి కూడా కలుగుతుందట.

కదులుతూ ఉండటం:
చిన్న పిల్లలు చేస్తే అది వారి ఉత్సాహానికి అర్ధం.అదే పెద్ద వారు చేస్తే అది ఆందోళనకు అర్ధం.

ఎక్కువ సేపు తెరను చూచుట:
టీవీ తెరలను గానీ, కంప్యూటర్ తెరలను గానీ లేక మొబైల్ తెరలను గానీ ఎక్కువ సేపు చూస్తే అది మన కళ్లకూ మరియూ మెదడుకూ హాని కలిగిస్తుంది. అంతే కాకుండా ఎన్నో సందర్భాలలో మనకు తెలియకుండానే అనుబంధాలకు కూడా హాని కలిగిస్తుందట.

No comments:

Post a Comment