Tuesday, August 19, 2014

సంవత్సరంలో 350 రోజులు మేఘాలే రాని చోట అమర్చిన ఖగోళశాస్త్ర గణితశాల....ఫోటోలు

ఉత్తర చిలి దేశంలోని అటకామా ఎడారి ప్రాంతంలో సముద్రమట్టానికి 2,635 మీటర్ల ఎత్తున నిర్మించబడ్డ ఈ ఖగోళశాస్త్ర గణితశాల పేరు పరనాల్. ఇక్కడ సంవత్సరానికి 15 రోజులు మాత్రమే మేఘాలు వస్తాయి. మిగిలిన 350 రోజులూ మేఘాలే అడ్డురావు కాబట్టే ఇక్కడ ఈ ఖగోళశాస్త్ర గణితశాలను నిర్మించేరు. దక్షిణ యూరోప్ ఖండంలోనే ఇదే ప్రధాన ఖగోళశాస్త్ర గణితశాల. ఇక్కడ అతిపెద్ద టెలస్కోప్ లను అమర్చేరు. 8.2 మీటర్ల పొడవుతో, మరెన్నో వేలకొలది పరికరాలతో ఉండే టెలస్కోప్ లను అమర్చేరు. ఇలాంటివి అక్కడ 4 ఉన్నాయి. ఖగోళ మరియూ గణిత శాస్త్రజ్ఞులకు మరియూ ఫోటోగ్రాఫర్లకు మాత్రమే తెలిసున్న ఈ ఖగోళశాస్త్ర గణితశాల గురించి చాలామంది ప్రజలకు తెలియదు. అయితే 2008 లో తీయబడిన జేమ్స్ బాండ్ సినిమా క్వాంటం ఆఫ్ సొలేస్ అనే సినిమా వలన కొంతమంది ప్రజలు ఈ ఖగోళశాస్త్ర గణితశాల గురించి తెలుసుకున్నారు.

టెలెస్కోప్ లే కాకుండా నియంత్రణ భవనాలూ, నిర్వహణ భవనాలూ మరియూ ఒక హోటల్( అక్కడ పనిచేసే వారికీ మరియూ పర్యాటకులకు)నిర్మించబడింది. ఈ భవనాలు టెలెస్కోపులు ఉన్న చోటుకు 200 మీటర్ల అడుగున నిర్మించేరు. ఇక్కడ శ్రేష్ఠమైన విషయమేమిటంటే పర్యాటకులను ఉచితంగా ఈ ఖగోళశాస్త్ర గణితశాలకు తీసుకు వెడతారు.


ఇవే అత్యంత పెద్ద టెలెస్కోపులు

పౌర్ణమి నాడు ఖగోళశాస్త్ర గణితశాల వెనుక చంద్రుడు

పై నుండి ఈ ఖగోళశాస్త్ర గణితశాల

సగం భూమిక్రింద ఉండే హోటల్

లేజర్లతో కృత్రిమమైన నక్షత్రాలను ఏర్పరచుట

No comments:

Post a Comment