Wednesday, July 9, 2014

బార్సెలోనా విమానాశ్రయం లో తృటిలో తప్పిన పెను విమాన ప్రమాదం కెమెరాకు చిక్కింది ....వీడియో

విమాన ప్రమాదం వలన కలిగే నష్టం ఏంత భారీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈనెల 5వ తేదీన స్పెయిన్‌లోని బార్సెలోనా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ఒక విమానం ల్యాండ్ అవుతుండగా అదే సమయంలో మరో విమానం రన్‌వే పైకి దూసుకువచ్చింది. ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది. అయితే, రన్‌వే పైకి మరో విమానం రావటాన్ని గుర్తించిన పైలట్, ల్యాండింగ్ చేయాల్సిన విమానాన్ని హఠాత్తుగా తిరిగి టేకాఫ్ చేశాడు. పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. యూటిఎయిర్ బోయింగ్ 767-300 విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు రన్‌వే పైకి అకోలైనియాస్ అర్జెంటీనాస్ ఎయిర్‌బస్ ఏ340-300 విమానం రన్‌వేను దాటుతోంది.




No comments:

Post a Comment