Saturday, July 19, 2014

మేఘాలలోకి తీసుకు వెళ్లే రైలు.....ఫోటోలు

సముద్ర మట్టానికి 4000 మీటర్ల ఎత్తుకు తీసుకు వెళ్లే ఈ రైలును "ట్రైన్ టు ది క్లౌడ్స్" అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన రైలు మార్గం ఇదే. అర్జెంటైనా దేశంలోని సల్టా నగరం నుండి లా పోల్వోరిల్లా అనే చోటుకు వెళ్లే ఈ రైలు 217 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఈ మార్గం లో ఈ రైలు 29 వంతెనలు, 21 గుహలు లోనుండి పయణించి చివరికి పోల్వోరిల్లా చేరుతుంది. 4200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశములో మేఘాలూ, స్వచ్చమైన గాలి, చల్లటి కాలుష్యూం లేని వాతావరణం ఉంటుంది. పర్యాటకులు అక్కడ దిగి కాసేపు అ మేఘాల ఉనికిని, గాలిని, చల్లటి వాతావరణాన్ని అనుభవించి, ఫోటోలు తీసుకుని తిరిగి అదే రైలులో బయలుదేరిన చోటుకు తిరిగి వెడతారు.

1920 లో అమెరికాకు చెందిన ఇంజనీర్ రిచర్డ్ ఫాంటైన్ మౌరే ఈ రైలు మార్గాన్ని నిర్మించేరు. అప్పట్లో ఈ రైలు మార్గం ఒక ఖనిజ సంపదను రవానా చేయడనికి నిర్మించేరు. 1970 నుండి దీనిని ఒక పర్యాటక స్థలంగా మార్చేరు.


No comments:

Post a Comment