Sunday, July 6, 2014

ఎక్కువగా మాట్లాడే భాషలు....ఫోటోలు

ప్రపంచంలో వందలాది భాషలు వాడకంలో ఉన్నాయి. అందులో ఎక్కువగా మాట్లాడబడే భాషలు ఏవో తెలుసుకుందాం.

Mandarin....మాండరిన్:...ప్రపంచ జనాభాలో సుమారు 100 కోట్ల మంది మాట్లాడే ఈ భాష ఉత్తర, దక్షిణ మరియూ పశ్చిమ చైనాలోని ప్రజలు మాట్లాడతారు. యూనైటడ్ నేషన్స్ లోని 6 అధికార భాషలలో ఇదీ ఒకటి.

English.....ఇంగ్లీష్: ప్రపంచవ్యాప్తంగా 430 మిల్లియన్ల ప్రజలు మాట్లాడే ఈ భాష కూడా యునైటడ్ నేషన్లోని 6 అధికార భాషలలో ఒకటి.

Spanish....స్పానిష్: యూనైటడ్ నేషన్లోని అధికార భాషలలో ఒకటైన ఈ భాషను ప్రపంచవ్యాప్తంగా 410 మిల్లియన్ల ప్రజలు మాట్లాడుతున్నారు.

Hindi....హిందీ: భారతదేశ అధికార భాష ఇది. ప్రపంచవ్యాప్తంగా ఈ భాషను 180 మిల్లియన్ల ప్రజలు వాడుతున్నారు.

Bengali.....బెంగాలి: బంగ్లాదేశ్ దేశంలో దేశీయ భాష అయిన ఈ భాషను భారత దేశంలోని పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురా రాష్ట్రాలలో కూడా మాట్లాడబడే భాష ఇది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 210 మిల్ల్లియన్ ప్రజలు ఈ భాషను మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంకా మరియూ భారతదేశ జాతీయ గీతాలు ఈ భాషలోనే రాయబడింది.

Portuguese....పోర్చుగీస్: ప్రపంచవ్యాప్తంగా 220 మిల్లియన్ల ప్రజలు మాట్లాడే భాష ఇది. బ్రిజిల్, ముజాంబిక్ మరియూ మరికొన్ని దేశాల అధికార భాష ఇదే.

Russian....రష్యన్: ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 మిల్లియన్ల ప్రజలు మాట్లాడబడే ఈ భాష కూడా యూనైటడ్ నేషన్లొని 6 అధికార భాషలలో ఒకటి.

Urdu....ఉర్దూ: సుమారు 100 మిల్లియన్ ప్రజలు మాట్లాడే ఈ భాష పాకిస్తాన్ దేశంలో నూ మరియూ 6 భారత రాష్ట్రాలలోనూ మాట్లాడబడుతోంది.

Indonesian....ఇండోనేషియన్: ఇండోనేషియా దేశ అధికార భాష అయిన ఈ భాషను ప్రపంచవ్యాప్తంగా 150 మిల్లియన్ల ప్రజలు వాడుతున్నారు.

Japanese.....జపనీస్: సుమారు 125 మిల్లియన్ ప్రజలు మాట్లాడుతున్న ఈ భాష జపాన్ దేశ ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు.

No comments:

Post a Comment