Tuesday, July 29, 2014

చిట్టగాంగ్: ప్రపంచములోనే పడవలను పగులకొట్టే అతి పెద్ద ఆవరణ....ఫోటోలు

బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం కు దగ్గరగా 18 కిలోమీటర్ల పొడవకు సముద్ర (బే ఆఫ్ బెంగాల్) తీరాన పడవలను పగలకొట్టే ఆవరణ ఉన్నది. ఇది ప్రపంచములోనే అతిపెద్దది. ఇక్కడ సుమారు 2 లక్షల మంది పనిచేస్తున్నారు. సంవత్సరానికి 100 ఓడలను పగలకొడతారు. అలా పడవలను పగలకొట్టినప్పుడు వచ్చే ఇనుప ముక్కలను లారీలలోకి ఎక్కించి రీసైకిల్ కర్మాగారాలకు పంపుంతారు. బంగ్లాదేస్ దేశంలో ఉన్న ఇనుము ఇక్కడ తయారైన ఇనుమే.

1960 లో బంగాళా ఖాతంలో ఏర్పడిన తుఫానలో గ్రీకు దేశానికి చెందిన రవాణా ఓడ ఒకటి బంగ్లాదేస్ లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం దగ్గరకు కొట్టుకు వచ్చింది. ఈ ఓడను తిరిగి తీసుకువెళ్లలేకపోయరు.1965 వరకు ఆ ఓడ అక్కడే ఉండిపోయింది. గ్రీకు దేశం ఆ ఓడను సరిచేసి తీసుకు వెళ్లలేక వదిలేసేరు. అప్పుడు చిట్టగాంగ్ స్టీల్ హౌస్ ఆ ఓడను అతి తక్కువ ధరకు గ్రీకు దేశం నుండి కొనుక్కుని ఆ ఓడను పగులగొట్టి అందులో నుండి స్టీల్ ముక్కలను తీసేరు. అలా మొదలైంది చిట్టగాంగ్ స్టీల్ హౌస్. ఆ తరువాత ఆ స్టీల్ హౌస్ పలుదేశాలో పనికిరాకుండా వదిలేసిన ఓడలను కొనడం మొదలుపెట్టి 1980 నుండి 1990 వరకు అక్కడ నుండి తీసిన స్టీల్ తో బంగ్లాదేశ్ కు అవసరమైన స్టీల్ ను తయారుచేసేరు. 2008 లో ప్రపంచములోనే స్క్రాప్ స్టీల్ తీసే కంపెనీలలో మొదటిదయ్యింది. 2008 లో ఓడలను పగులగొట్టే చిరు సంస్థలు 20 కి పేరిగినై. 2009 లో అది 40 గా పెరిగింది. అలా మొదలైన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచములోనే అత్యంత లాభకరమైన వ్యాపారంగా కూడా మారింది.


No comments:

Post a Comment