Tuesday, July 15, 2014

సైగచేయు పిల్లి(పిల్లుల) గుడి....ఫోటోలు

"మనేకి నెకో" లేక "సైగ చేయు పిల్లి" ....ఇది జపాన్ దేశంలో అత్యంత పేరుపొందిన బొమ్మ(విగ్రహం). అద్రుష్టం మరియూ ఐశ్వర్యం తీసుకు వస్తుందని గట్టి నమ్మకంతో జపాన్ దేశ ప్రజలు తమ ఇళ్లల్లో, షాపులలో, వ్యాపార కెంద్రాలలో మరియూ ఆఫీసులలో ఈ పిల్లి బొమ్మను తప్పక ఉంచుకుంటారు. సెటగయా నగర సరిహద్దులలో " గొటుకూ-జి" అనే పేరుతో ఈ పిల్లి విగ్రహంతో ఒక గుడి ఉన్నది.

అనగనగా పూర్వం ఒకరోజు ఒక రాజు సెటగయా నగరంలో నుండి వెడుతూ, అలసి పోయి ఉండటంతో సేద తీర్చుకోవడానికి విస్రాంతి తీసుకునేందుకు ఒక చెట్టు దగ్గర ఆగేడు. ఇది గమనించిన ఒక పిల్లి ఆ రాజుకు సైగ చేసి వేరే చోటుకు తీసుకు వెళ్లింది. కొద్ది క్షణాలలో గాలీ వానతో కూడిన వర్షం పడటం, అప్పుడు ఒక పిడుగు రాజు అంతకు ముందు నిలబడ్డ చోట పడటం జరిగింది. అది చూసిన రాజు పిల్లిని తన అద్రుష్ట దేవతగా భావించి కోట్లకొలది డబ్బు ను పెట్టి అక్కడ ఆ పిల్లికి ఒక గుడి కట్టించి, తమ కుటుంభ గుడిగా మార్చుకున్నాడట. అప్పటి నుండి ఆ గుడి, సైగ చేసే పిల్లి జపాన్ ప్రజలకు ప్రియమైనదిగా మారింది.


No comments:

Post a Comment