Thursday, July 24, 2014

జాతీయ టెలివిజన్లలో చోటు పొందిన, బొచ్చు కత్తిరించే వారి దగ్గర నుండి 6 ఏళ్లుగా తప్పించుకున్న గొర్రె....ఫోటోలు

న్యూజీలాండ్ దేశంలొ మరినో గొర్రెల జాతికి చెందిన స్రెక్ అనే గొర్రె 2004 లో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. కారణం దానికుండే ఒత్తిడైన అత్యంత బొచ్చు. గొర్రె బొచ్చు కత్తిరించే వారి దగ్గరనుండి ఎలోగలా తప్పించు కుంది ఈ గొర్రె. 6 సంవత్సరాల తరువాత తిరిగి కనబడింది. అప్పుడు ఈ గొర్రె ఏదో దైవ జంతువులా కనిపించింది.స్రెక్ గొర్రె సొంతదారుడు ఆశ్చర్యపోయేడు. ఈ ఆరు సంవత్సరాలలో ఆ గొర్రె బొచ్చు 27 కిలోలకు చేరుకుందట. అంటే... ఈ గొర్రె బొచ్చుతో లావాటి 20 మందికి సూట్లు కుట్టవచ్చు. ఖ్యాతి చెందిన ఈ గొర్రె గురించి న్యూజీలాండ్ జాతీయ టెలివిజన్లో చూపించేరు. ఈ గొర్రె బొచ్చును వేలం వేసేరు. వచ్చిన డబ్బును పిల్లల శరణాలయాలకు ఇచ్చేరు. ఈ గొర్రె న్యూజీలాండ్ ప్రధాన మంత్రిని కలిసింది. పిల్లల పాట్య పుస్తకాలలో చోటుచేసుకుంది. 2011 లో 16 ఏళ్ల జీవితం తరువాత ఈ గొర్రె చనిపోయింది.


No comments:

Post a Comment