Thursday, July 31, 2014

చప్పరిస్తుంటే రంగులు మారే ఐస్ క్రీం....ఫోటోలు(ఒక గ్రాఫిక్ ఫోటో)

స్పైన్ దేశానికి చెందిన భౌతికశాస్త్రవేత్త మరియూ ఎలెక్ట్రానిక్ ఇంజనీర్ మరియూ చెఫ్ అయిన ఐస్ క్రీం మాస్టర్ Manuel Linares చప్పరిస్తుంటే రంగులు మారే ఐస్ క్రీం కనుగొన్నాడు. ఈ ఐస్ క్రీం రసాయణ సూత్రం ఇంకా పేటెంట్ పెండింగ్ లో ఉండటంవలన రహస్యముగా ఉంచేరు. ఈ ఐస్ క్రీం పూర్తిగా ప్రకృతి వస్తువుల మిశ్రమముతో తాయారుచేయబడిందని చెబుతూ ఈ ఐస్ క్రీం కు Xamaleón అని పేరుపెట్టేడు.


 photo 1_zps8ff7a090.gif


ప్రపంచంలోని పలు చోట్లలో సూర్యోదయ అందాలు......ఫోటోలు

ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే లేవడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. సూర్యోదయ సమయాన భూమిపై పడే కిరణాలు శక్తివంతమైనవి.

ఈ కిరణాలు మన శరీరంపై పడితే నరాలకు కొత్త ఉత్తేజం కలుగుతుందని పండితులు అంటున్నారు. అంతేగాకుండా సూర్యోదయ కిరణాలు మన శరీరంపై పడితే కొత్త ఉత్సాహం చేకూరుతుందని వారు చెబుతున్నారు.

ఈ కారణంతోనే ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయడం మంచిదని పెద్దలంటూ ఉంటారు. సూర్య నమస్కారం చేయడం ద్వారా ఆ కిరణాల ప్రభావంతో దేహబలం, కంటి ఆరోగ్యం కూడా చేకూరుతుందని పండితులు అంటున్నారు.

ఇకపోతే... శనివారం సూర్యోదయానికి ముందే లేచి, నువ్వుల నూనెతో తలస్నానం చేసి సూర్యనమస్కారం చేసే వారికి ఈతిబాధలు, శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

అయితే ఈ హరీబర్రీ రోజుల్లో సూర్యోదయానికి ముందే లేవడం కష్టమౌతోంది. ఒక వేల లేచినా సూర్యోదయ కిరణాలు మనమీద పడటంలేదు. కారనం మనం ఉంటున్న నగరాలులోని భవనాలు వాతిని అడ్డుకుంటున్నాయి.

వాటిని చూసే భాగ్యమైన కలిగించుకుందామనే తపనతో ఈ ఫోటోలను ఈ టపాలో ఉంచుతున్నాను.

Mt. Fuji, Japan

Chicago, Illinois

St. Albans, Maine

Barrie, Ontario

New Forest National Park, England

Cincinnati, Ohio

Antibes, France

Isla Ometepe, Nicaragua

Værøy, Norway

Mount Langi Ghiran, Victoria, Australia

నీళ్లు కావాలని అడిగి తాగుతున్న భయంలేని చుఱుకైన కాకి....వీడియో

కాకులు సహజంగా మనుషులను చూసి వెళ్లిపోతాయి. అందులోనూ గుంపుగా ఉన్న మనుష్యులకు దూరంగా ఉండి వారు వెళ్లిపోయినాక అక్కడ మిగిలినవి తింటాయి. కానీ ఈ వీడియోలో మీరు చూడబోయే కాకి మామూలు కాకులకు విరుద్దంగా ప్రవర్తించింది. గుంపుగా ఉన్న మనుష్యుల మధ్యకు వచ్చి వారి పెట్టినది తిని ఆ తరువాత దాహంగా ఉంటే మంచి నీళ్లు కావాలని అడిగి తాగింది. ఇది నిజంగానే భయంలేని చుఱుకైన కాకి.

Wednesday, July 30, 2014

వివిధ దేశాలలో భోజనం చేయు విధాన చిట్కాలు.....ఫోటోలు


మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది...నిజమో కాదో మీరే ట్రై చేయండి


ఎవరు ఈ లెక్కల సూత్రాన్ని కనుకున్నారో తెలియదు. కానీ అది నిజమే. ఆశ్చర్యం...నిజంగా ఆశ్చర్యం.

మీ సెల్ ఫోన్ నెంబర్ తో క్రింద వివరించిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో కాదో తెలుసుకోండి.

1)మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను తీసుకోండి.

2) దాన్ని 2 తో గుణించండి.

3) ఆ మొత్తానికి 5 కూడండి.

4) ఈ మొత్తాన్ని 50 తో గుణించండి.

5)వచ్చిన మొత్తానికి 1764 కూడండి.

6) ఆ వచ్చిన మొత్తంలోనుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి.

ఇప్పుడు 3 అంకెలు వస్తుంది.....ఆ మూడు అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె, మిగిలిన రెండంకెలు మీ ప్రస్తుత వయసు.......ఆశ్చర్యంగా ఉన్నది కదూ!


ఆంగ్లంలో

Check this its true.YOUR PHONE NUMBER. WILL REVEAL YOUR AGE.

AMAZING -AMAZING-AMAZING

Your Phone number will reveal your actual Age.

I do not know who discovered this?....but it is...Really accurate.

It will take about 15 seconds,read and do it at the same time so that you will not lose the fun.

1- Take a look at your last digit of your cell phone number

2- Use this figure and multiply by 2

3- Then add 5

4- And then multiply by 50

5-And then add the number 1764

6- The last step; with this number, subtract your birth year.

Now you see a three-digits number.

The first digit is the last digit of your phone number, the next two digits are your actual age!

IS'NT THIS SURPRISING?

హృదయం(గుండె)గురించిన ఈ నిజాలను తెలుసుకోండి.....ఫోటోలు