Saturday, June 7, 2014

విచిత్రమైన శరీర మర్దనలు....ఫోటోలు

మంటలతో శరీర మర్దన, చైనా
చైనా ఆసుపత్రులలో చలి కాలంలో మంటలతో వైద్యం చేయడం సాంప్రదాయం. ఒక గుడ్డను కాలేస్వభావముగల రసాయనముతో తడిపి ఆ గుడ్డను తగలబెట్టి మరో గుడ్డపై ఉంచి రోగి శరీరంపై ఉంచితే రోగమూ తగ్గుతుంది, మరొ జబ్బు (ముఖ్యంగా ఫ్లూ మరియూ జలుబు)రాదని వారి గట్టి నమ్మకం. అదే ఇప్పుడు మంటల మర్దనగా అవతరించింది. కోడి గుడ్లతో పిల్లలకు తల మర్దన, చైనా
ఇది కూడా చైనాలోనే. పిల్ల లేక పిల్లవానికి 2 వ సంవత్సరం రెండవ పౌర్ణమి నాడు తల వెంట్రుకలు తీయించి, ఆ తరువాత ఆ తలపై కోడి గుడ్లతో మర్దన చేస్తే ఆ పిల్ల/పిల్ల వానికి అద్రుష్టం కలిసివస్తుందని వారి నమ్మకం.

చెంపదెబ్బ మర్దన, తాయ్ లాండ్
మానవజాతి చరిత్రలో చెంపదెబ్బ కొట్టడం వ్యతిరేకార్థకమైన ప్రతిస్పందన. కానీ చరిత్ర నిదానంగా మారుతోందనే చెప్పాలి. చెంపదెబ్బ వ్యతిరేకార్థకమైన ప్రతిస్పందన కాదని మర్విన్ మరియూ తాయ్లాండుకు చెందిన టాటా అనే ఇరువురు ఈ చెంపదెబ్బ మర్దనకు లైసన్స్ పొందేరు. చెంపదెబ్బలతో ముఖ అందాన్ని మెరుగుపరచవచ్చు, ముఖ ముడతలను సరిచేయవచ్చు, అతుక్కునిపోయుండే ముఖాన్ని మామూలుగా తీసుకురావచ్చు మరియూ వయసు పెరుగుతున్న ముదిమి లక్షణాలను త్రిప్పికొట్టవచ్చు అని చెబుతున్నారు. 100 సంవత్సరాల క్రితం తమ గురువు ఈ మర్దనను కనిపెట్టి, దీని రహస్యాన్ని 10 మందికి మాత్రమే చెప్పి నేర్పించిందట. మిగిలిన లైసన్స్ దారులు ఎవరూ అనేది తెలియదట.వీరిరువరూ ఇప్పుడు అమెరికాలోని సాన్ ఫ్రాన్ సిస్కో నగరంలో చెంపదెబ్బ మర్ధన సావడి నడుపుతున్నారు. ఈ మర్దన చేయించుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు.

ఆఫ్రికా నత్తగుల్లల మర్దన
రష్యా,జపాన్ మరియూ బ్రిటన్ దేశాలలో ఈ మర్ధనకు మంచి గిరాకీ ఉంది. ఆ దేశాలలో ఈ మర్దన సావడులు చాలా ఉన్నాయి. ముఖ్ చర్మాన్ని మెత్తదిగా చేస్తూ అందాన్ని మెరుగుపరుస్తుందట, ముఖ ముడతలు పోతాయట, ముఖంపై ఏర్పడిన మచ్చలను సైతం పోగొడతాయట, కాలిన చర్మమును కూడా సరిచేస్తాయట. ఎలాగంటే ముఖం పై 3 నత్తగుల్లలను ఉంచుతారు. వాటిని పైకీ,క్రిందకూ పంపుతారు. ఆ నత్తగుల్లలు ముఖంపై విదిచే బంక చర్మానికి మెరుగులు ఇస్తుందట.

గండోలా(ఒకవిధమైన పడవ)మర్దన, ఇటాలీ
ప్రపంచములోనే అతి రొమాంటిక్ నగరం వెనీస్ అని అందరికీ తెలుసు. ఇటాలీ లోని ఈ నగరంలో ఒక హోటల్లో ఈ మర్దన సావడి ఉన్నది. విశ్రాంతి కావాలని కోరుకుంటూ, నగరమంతా తిరగాలనుకునేవారికి ఈ మర్దన చాలా ఉపయోగపడుతుంది. నగర నడిబొడ్డులో ఉన్న ఒక సరస్సులో, ఒక ప్రత్యేక పడవలో సరస్సులో తిప్పుతూ మర్దన చేస్తారు.

ఏనుగు మర్దన, తాయ్ లాండ్
నడుము నొప్పి ఉన్నవారు ఈ మర్దన చేయించుకోవచ్చు. చియాంగ్ మై అనే ఒక పర్యాటకుల పార్కులో శిక్షణ ఇచ్చిన ఒక ఏనుగుతో నడుము మీద సున్నితంగా తొక్కిస్తారట. భయం లేని వారు చేయించుకోవచ్చు.

మచ్చుకత్తి మర్దన,తైవాన్
2000 సంవత్సరాలకు ముందు చైనాలో మొదలుపెట్టబడ్డ ఈ మర్దన ఇప్పుడు తైవాన్ దేశములో ప్రసిద్దిచెందింది. పదునైన రెండు మచ్చు కత్తులతో ముఖంపై తడతారు. ఇలా చేయడవలన శరీరంలొ దాగున్న శక్తి బయటకు వస్తుంది, దీనివలన రక్త ప్రవాహం మెరుగు చెందుతుంది, దీనితో శరీరంలో ఉండే విషపూరిత వాయువులు బయటకు పోతాయి.

చక్కిలిగింత మర్దన, స్పైన్
చక్కిలిగింత నవ్వు మాత్రమే కాకుండా దానితో పాటు శరీరానికి కావలసిన శక్తిని మరియూ ఉత్సాహామునూ చేకూరుస్తుందట. అయితే కొంతమందికి చక్కిలిగింత నవ్వు తెప్పించదు. కానీ ఇక్కడా ఈ మర్ధనలో వారు ఉపయోగించే ఈకలూ, ఆ ఈకలు ఎక్కడ తగిలితే ఎవరైన సరే నవ్వే తీరుతారు అని ఖచ్చితంగా చెబుతూ స్పైన్ దేసములో ఈ మర్ధన సావడి వెలువడింది.

నాగతాళి మర్దన,మెక్సికో
మీరేమనుకుంటున్నారో అర్ధమౌతోంది. ఈ ఆకులకు ముళ్లు ఉంటాయి, అవి హానిచేస్తాయి అనేగా?. ఇక్కడ ముళ్ళు తీసేసిన నాగతాళి ఆకులతొ మర్ధన చేస్తాము. అది శరీరములోని మలినాన్ని వెలికి తీసి మిమ్మల్ను ఉత్తేజపరుస్తుంది. అని ప్రకటించేరు. చాలామంది చేయించుకుంటున్నారట.

కొండచిలువ మర్దన, ఫిలిపైన్స్
ఈ మర్దన ఉచితం. కానీ ఆ పాములను చూసి ఎవరు ఒప్పుకుంటారు. కానీ ఫిలిపైన్స్ దేశములో సెబూ నగర జూ లో ఈ ఏర్పాటు చేసేరు. 250 కేజీల బరువున్న కొండచిలువలను శరీరంపై విడిచిపెడతారు. అవి కదులుతుంటే శరీరములో ఏర్పడే మార్పులు నొప్పులనూ అనేక రకాల రోగాలను నయం చేస్తాయని చెబుతున్నారు.

No comments:

Post a Comment