Tuesday, June 3, 2014

డ్రైవ్ చేసుకొగల సూట్ కేస్ స్కూటర్....ఫోటోలు

చైనాకు చెందిన "హి" అనే అతను ఈ డ్రైవ్ చేసుకొగల సూట్ కేస్ స్కూటర్ ను కనుగొన్నారు. 15 పౌండ్ల బరువు కలిగిన ఈ డ్రైవ్ చేసుకొగల సూట్ కేస్ బ్యాటరీతో నడుస్తుంది.

ఇద్దరు కూర్చుని వెళ్ళ గల ఈ సూట్ కేస్ స్కూటర్ గంటకు 12 మైళ్ల స్పీడుతో 37 మైళ్లవరకు నడవగలదు. జి.పి.ఎస్ వసతి దొంగతనం అలారం కలిగి ఉంటుంది. విమానాశ్రయాలలోకి మరియూ బస్ స్టేషన్లలోకి సూట్ కేసులను మోయకుండా తీసుకువెళ్లవచ్చు.


ఈ సూట్ కేస్ స్కూటర్ను కనుగొనడానికి ఈయనకు 10 సంవత్సరాలు పట్టింది. పెద్దగా చదువుకోలేని ఈయన వ్యవసాయం చేస్తాడు. అయితే ఎప్పుడూ ఏదో ఒకటి కనుక్కోవాలని ఆలొచిస్తూ ఉంటాడట. 10 సంవత్సరాల క్రితం అంటే 1999 లో ఈయన ఒక కార్ సేఫ్టీ సిస్టం కనుగొన్నారు. దీనికి ఆయనకు అమెరికా అవార్డ్ ప్రకటించింది.


అవార్డును తీసుకోవడానికి అమెరికా వెళ్లేటప్పుడు ఈయన సూట్ కేసు పోయింది(ఎవరో కొట్టేసేరు). ఆ సమయాన ఆయనకు ఈ కొత్త ఆలోచన... అదే సూట్ కేస్ స్కూటర్ ఐడియా తట్టింది. వెంటనే దానికొసం శ్రమ పడటం మొదలుపెట్టేడు. 10 సంవత్సరాల ఫలితమే ఈ సూట్ కేస్ స్కూటర్.


No comments:

Post a Comment