Thursday, June 26, 2014

ఎండాకాలం: ప్రపంచమంతా వేడిమయం....ఫోటోలు

ఎండాకాలం వచ్చింది ఎండలు బాగా ముదిరినాయి .ఇంట్లోనుండి బయటికి రావడానికి ప్రజలు చాలా బయపడిపోతున్నారు.ముఖ్యముగా వయసు మళ్లినవారికి ఈ ఎండాకాలం దినదిన గండంగా మారింది.


ఈ సంవత్సర ఎండాకాలం ధాటికి కారణం ఎల్ నినో ప్రభావం,గ్లోబల్ వార్మింగే


ఈ సంవత్సరం మన దేశాన్ని అతాకుతలం చేస్తున్న ఎండల వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురౌతున్నారు. ఎందరో మరణించేరు.


సహజంగా మే నెలాఖురుకి తగ్గవలసిన ఎండాకాలం ఈ సంవత్సరం ఎప్పుడు తగ్గుతుందో అంతుపట్టటంలేదు. ఎప్పుడు వర్షాలు పడతాయో అర్ధంకాక ప్రజలు తలలు పగలకొట్టుకుంటున్నారు.


ఇలా ప్రజలు ఎండలకు తపించిపోవటానికి ముఖ్య కారణం ప్రపంచదేశాల ప్రభుత్వాలే.


ఎందుకంటే వీరంతా ప్రక్రుతితో ఆడుకున్నారు. శాస్త్రవేత్తలు ఎంత చెబుతున్నా ఏ ఒక్క ప్రభుత్వమూ పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవటమే దీనికి అతి ముఖ్య కారణం. దీనితో ప్రక్రుతి మానవులకు ఎదురుతిరిగింది.


ఈ విషయాన్ని ఆలశ్యంగా తెలుసుకున్న ప్రపంచదేశాలు(చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవటమంటే ఇదే) ఆ మధ్య పర్యావరణ పరిరక్షణ ప్రణాళికకు అక్షరాబాస్యం చేసేరు.


కానీ దేశాల మధ్య విభేధాలు ఏర్పడటంతో ఆ ప్రణాళికలు పూర్తి స్థాయి ఆచరనలోకి రాలేదు. ఒక వేల అన్నిదేశాలు ఈ విషయములో ఒకటిగా చేరినా పర్యావరణ పరిరక్షణతో ప్రక్రుతిని పూర్తిగా పాత స్థితికి తేలేరు. కాబట్టి ప్రక్రుతికి మానవులు ఇప్పటివరకూ చేసిన హానికి శిక్షలు పడుతూనే ఉంటాయి.అందులో భాగమే ఇప్పుడు మనం చూస్తున్న ఎండాకాలం.


మనదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేయి. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటో చవిచూసేరు.


దీని ప్రభావం వచ్చే ఎండాకాలంలో మరింత ఎక్కువగా ఉంటుందట.

No comments:

Post a Comment