Thursday, June 19, 2014

"మీరు ప్రేమించేవారిని ఒక సారి పలకరించండి" అద్భుతమైన ఈ విషయాన్ని ఇతను ఎలా ప్రజలముందుంచేడో తెలుసుకోండి....ఫోటోలు మరియూ వీడియో

"జీవితంలొ ముఖ్యమైన విషయం ప్రేమించేవారిని జ్ఞాపకముచేసుకోవటం". పెద్దపెద్ద నగరాలలోనే కాదు, చిన్న చిన్న గ్రామాలలోకూడా పబ్లిక్ టెలఫోన్ బూత్ లను ఎవరూ వాడటంలేదు. కారణం అందరి దగ్గరా సెల్ ఫోన్లు ఉండటమే. అందువలన పబ్లిక్ టెలిఫోన్ బూత్ టెక్నాలజీ పాతబడిపోయింది. పబ్లిక్ టెలఫోన్ బూత్ లు ఖాలీగా ఉన్నాయి. కానీ న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న మాట్ ఆడం మరియూ అతని స్నేహితురాలు కటీ కి ప్రజలలో ఈ పబ్లిక్ టెలఫోన్ బూత్ లను ఎలా వాడించాలో ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఒక టెలిఫోన్ బూత్ లో తమ ఐడియా అమమలు పరిచేరు. అద్భుతం...వారు చేసిన పని వారికే కాక ప్రజలందరికీ అద్భుతమనిపిచ్చింది. ఎంతో సంతొషంగా ఆ పబ్లిక్ టెలిఫోన్ ను ప్రజలు వాడుకున్నారు. సంతోషించేరు. మాట్ ఆడం మరియూ అతని స్నేహితురాలు కటీ ఏమి చేసేరో మీరు చూడండి.

ఒక పబ్లిక్ టలఫోన్ బూత్ పైన "కాల్ సం ఒన్ యూ లవ్" అనే ప్రకటన పలక ఉంచేరు

టెలఫోన్ బూత్ లో నాణెము వేయడానికి టేపులతో నాణెములను అతికించి పెట్టేరు

చాలామంది (తమ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నా) అక్కడ ఆగి, నవ్వు ముఖాలతో, నవ్వుతూ తాము ప్రేమించిన వారికి "హలో" చెప్పేరు

ఈ పిల్ల ఎక్జైట్మెంటుకు గురైయ్యింది
చివరికీ అందరూ సంతోషించేరు. మాట్ ఆడం మరియూ అతని స్నేహితురాలు కటీ కి ధన్యవాదాలు తెలుపుకున్నారు. వీరిరువరికీ చెప్పలేనంత త్రుప్తి కలిగింది


గ్రేట్ జాబ్

No comments:

Post a Comment