Sunday, June 15, 2014

ప్రపంచములొని అతిపెద్ద సౌర అగ్ని గుండం.....ఫోటోలు

ఫ్రాన్స్ దేశ దక్షిణ ప్రాంతములో( దరిదాపుగా స్పైన్ దేశ సరిహద్దుకు దగ్గరగా) ఓడిల్లో అనే ప్రదేశం భూమి మీదే ఎక్కువ సేపు సూర్యరస్మి కలిగిన ప్రదేశం. ఇక్కడ సంవత్సరంలో 3,500 గంటల సేపు సూర్య రస్మి ఉంటుంది. అందుకనే ఇక్కడ సౌర అగ్ని గుండమును ఏర్పాటుచేసేరు. 1969 లో నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ వారు ఈ అగ్ని గుండాన్ని ఏర్పాటు చేసేరు. ఇక్కడ 63 సూర్య రస్మి నిశ్చలత అద్దాలను అమర్చేరు. ఈ అద్దాల మీదపడే ఏండ ఆ ప్రదేశములో ఉష్ణొగ్రతను 3,500 డిగ్రీల సెంటీగ్రేడ్ కు పెంచుతుంది. ఇక్కడ ఎండవలన(అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత)ఏర్పడే మార్పులూ, ఆ ఉష్ణొగ్రతను తట్టుకోగలిగే సామగ్రి(ద్రవ్యమూ, వస్తువులూ మరియూ ఉష్ణోగ్రత నుండి మనం తెచ్చుకోగల శక్తి) గురించిన పరిశోధనలు చేస్తారు.


No comments:

Post a Comment