Thursday, June 12, 2014

అత్యంత ఖరీదైన పెంపుడు జంతువులు....ఫోటోలు

Chinese Crested Dog
10 పొండ్ల బరువు మాత్రమే ఉండే ఈ జాతి కుక్కలకు జుట్టు ఎక్కువగా ఉండదు. సుతిమెత్తని శరీరం కలిగి ఉంటాయి. పై చిత్రంలో చూస్తున్న కుక్క ఆ జాతికి చెందినదే. దాని పేరు శ్యాం. 2003-2005 సంవత్సరాలో జరిగిన "వికార కుక్కలు" పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న ఈ కుక్కను రూ.5 లక్షలకు కొనుక్కున్నారు.

Savannah Cats
నల్ల పిల్లులు దురదృష్టం కు పేరైతే, మిగిలిన రంగుల పిల్లులు అద్రుష్టానికి పేరట. చూడటానికి పులి పిల్లలలా ఉండే ఈ పిల్లులు అత్యంత నిజాయతీగా ప్రవర్తిస్తాయట. విశ్వాశం చూపడంలో కుక్కకను మించుతుందంటున్నారు ఈ పిల్లిని కొనుక్కునే వారు. రూ. 2 లక్షల నుండి రూ 6 లక్షలు దాక ఖరీదు పలుకుతాయట.

De Brazza’s Monkey
కోతులను పెంపుడు జంతువులుగా ఉంచుకోరు. పెంపుడు జంతువుల పట్టీలో కూడా ఉండదు. కానీ పైన చూస్తున్న చిత్రంలో ఉండే కోతి మధ్య ఆఫ్రికా అడవులలో ఉంటుంది. మార్కెట్ లో దీని ఖరీదు రూ 6 లక్షలట. ఒక వేల ఎవరన్న కొనుకున్నా ఏ ప్రభుత్వమూ దీనిని పెంచుకోవడానికి అనుమతించదట.

Lavender Albino Ball Python
ఈ కొండచిలువ ఖరీదు రూ 22 లక్షలు. ఈ కొండచిలివ లావెండర్ రంగుతో పసుపు చుక్కలతో ఉండటమే దానికి ఆ విలువను ఇచ్చింది. ఆఫ్రికాలో మాత్రమే దొరికే ఈ కొండచిలువలను ఒకప్పుడు పెంపుడు జంతువుగా ఉంచుకునేవారట. ఇప్పుడు ఉంచుకోవాలన్నా దీని ఖరీదు పాముల ప్రేమికులను భయపెడుతున్నది.

Pacific Bluefin Tuna
ఈ జాతి చేపలు ప్రపంచములో తరిగిపోతున్న తరుణంలో, చేప ప్రియులు ఈ జాతి చేపకు రూ. కోటి రూపాయలదాక ఇస్తున్నారంటే! ఒక చేప బరువు 550 టన్నులు ఉంటుందట. మార్కెట్ లో ఒక కిలో ఖరీదు రూ 45 వేలట.

Ponoka Morsan Farm cows
ప్రపంచములోని ఖరీదైన ఆవులు ఎక్కడ ఉన్నాయంటే అది కెనడా దేశం. ఈ ఆవులు ఏమి తింటాయనుకుంటున్నారు. మనలాగే, అంటే మనుష్యులలాగే అత్యంత విలువైన ఆహారాలను తింటుంది. ఊదాహరణకు: సోయా బీన్స్ అన్నం, మినరల్స్, బార్లీ గింజలూ, కార్న్ ఫ్లేక్స్. అలాగే ఈ ఆవులు పెరిగే ప్రదేశాలు మామూలు అవుల దొడ సావడిలు కావు. వాతావరణ నియంత్రిత భవనాలూ మరియూ హై సెక్యూరిటీ మైదానాలలో పెరుగుతాయి. ఈ జాతి ఆవులలోనే మిస్సీ అనే ఆవును రూ 2 కోట్లు ఇచ్చి కొనుకున్నారు.

Really Fast Pigeons
గత ఏడాది బెల్జియాకు చెందిన పావురాల వ్యాపారస్తుడు అత్యంత వేగంగా ఎగిరే 66 పావురాలను రూ. 15 కోట్లకు అమ్మేడు. ఇందులో అత్యంత వేగంగా ఎగిరే పావురం "బోల్ట్" కూడా ఉన్నది. ఒలింపిక్స్ లో అత్యంతవేగంగా పరిగెత్తే చాంపియన్ ఊష్యాన్ బోల్ట్ పేరు ఆ పావురానికి పెట్టేడు. ఆ మధ్య భయం పుట్టించిన "బర్డ్ ఫ్లూ" వ్యాధికి భయపడి వీటిని అమ్మేసేడు.

Kentucky Derby Bred Horse
అత్యంత ఖరీదైన జాతి గుర్రాలను పెంచడం గుర్రపు పందాలకు ఉపయోగించుకోవటానికే. అలాంటి జాతికి చెందిన "ది గ్రీన్ మంకీ" అనే పేరుగలిగిన 2 సంవత్సరాల వయసున్న ఈ గుర్రాన్ని 2006 లో రూ. 50 కోట్లు ఇచ్చి కొనుకున్నారు. కానీ ఈ గుర్రం పాల్గొన్న ఏ రేసులోనూ గెలవలేదు. అందుకని ఈ ఖరీదైన గుర్రాన్ని కొనుకున్న యజమాని 2008 తరువాత ఇక రేసులలో ఉంచలేదు.

No comments:

Post a Comment