Monday, June 30, 2014

14 సంవత్సరాలుగా వింబుల్డన్ రక్షణ దళం సభ్యులలో ఒకరిగా ఉంటున్న డేగ....వీడియో

వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్ , లేదా సాధారణంగా వింబుల్డన్ , అనేది ప్రపంచంలో అతి పురాతన టెన్నిస్ టోర్నమెంట్, ఈ టోర్నీని అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తారు.లండన్ శివారైన వింబుల్డన్‌లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో 1877 నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. నాలుగు గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లలో ఇది కూడా ఒకటి, వీటిలో క్రీడ యొక్క అసలు ఉపరితలమైన, గడ్డిపై ఇప్పటికీ జరుగుతున్న ఏకైక టోర్నీ ఇదే కావడం గమనార్హం......ఈ వింబుల్డన్ పోటీలు జరుగుతున్నపుడు పోటీలకు అంతరాయం కలిగించే విధంగా గ్రౌండ్ లోకి పావురాలు వచ్చేవి. ఆ పావురాలను తరమటానికి కొందరుండేవారు. 2000 వ సంవత్స్రంలో రుఫుస్ అనే ఒక డేగను తీసుకు వచ్చి, దానికి ట్రైనింగ్ ఇచ్చి గ్రౌండ్ లో ఉంచేరు. ఆ డేగ పావురాలను తరిమి కొడుతూ ఉండేది. కొన్ని సంవత్సరాల తరువాత డేగ అక్కడుంటుందన్న సంగతి తెలుసుకున్న పావురాలు గ్రౌండ్ లోకి వచ్చేవి కావు. పోటీలు అంతరాయం లేకుండా జరిగేవి, జరుగుతున్నాయి.


No comments:

Post a Comment