Thursday, June 26, 2014

10 గంటల్లో చనిపోబోతాడన్న ప్రేమికుడిని, పెళ్ళి చేసుకున్న ప్రేమికురాలు......వీడియో

ఫిలిపైన్స్ కు చెందిన రౌడన్ గో పాంగోగా మరియూ అతని ప్రేమికురాలు లీజెల్ జూలై నెల 8 వ తారీఖున పెళ్ళిచేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ రోజు రౌడన్ గో పాంగోగా 30 వ పుట్టిన రోజు.

కానీ మే నెలలో రౌడన్ గో పాంగోగా కు లివర్ కాన్సర్ అని తెలుసుకున్నారు. అదికూడా చివరి దస( 5 వ స్టేజ్ )లో ఉన్నదని రౌడన్ గో పాంగోగా ఒక నెల రోజుల కంటే బతకడని, జూలై 15 అతని చివరి రోజుగా ఉంటుందని డాక్టర్లు తెలిపేరు.

వెంటనే రౌడన్ గో పాంగోగా తన చివరికోరికను తన కుటుంబీకులకు తెలియపరిచేడు. 10 గంటలలో రౌడన్ గో పాంగోగా అన్నదమ్ములు లీజెల్ ను కలిసి, ఆమెకు విషయం తెలిపి, ఆమె తల్లితండ్రులతో మాట్లాడి వెంటనే పెళ్ళి ఏర్పాట్లు చేసేరు. హాస్పిటల్లోనే బంధుమిత్ర సపరివారం పెళ్ళి అద్భుతంగా జరిపించేరు.



సరిగ్గా పెళ్ళి కోరిక తెలిపిన 10 గంటల తరువాత , పెళ్ళి జరిగిన రోజు రౌడన్ గో పాంగోగా జూన్ 11 న చనిపోయేడు.

No comments:

Post a Comment