ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Monday, May 26, 2014
తాయ్ లాండ్ లో తినదగిన కీటకములను ఎలా పెంచుతున్నారో చూడండి....ఫోటోలు
మనలో చాలామంది కొట్లకు వెళ్లి తినడానికి కావలసిన వాటిని కొనుక్కుని తెచ్చుకుంటాము. కానీ మన ప్రపంచములో కొంతమంది వారు పెంచుకున్నవాటినీ, పట్టుకున్నవాటినీ తింటారు. ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్దీ ఆహారానికి, అందులోనూ ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువ కలిగిన ఆహారానికీ కొరత ఏర్పడింది. ఈ కొరత తీర్చడానికి తినదగిన కీటకాలను తినడం మొదలుపెట్టేరు. ఈ తినదగిన కీటకాలను ఎక్కువగా ఉపయోగించుకున్నది తాయ్ లాండ్ దేశం. గత 15 సంవత్సరాలుగా తినదగిన కీటకాలను ఎలా పెంచుకోవాలో అనే విషయంలో తాయ్ లాండ్ ముందడుగు వేసి అభివ్రుద్ది చెందింది. ఈ దేశం సంవత్సరానికి 7,500 టన్నుల తినదగిన కీటకాలను ఉత్పత్తిచేస్తోంది. ప్రపంచ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం కొన్ని సంవత్సరాలలో తినదగే కీటకాలు ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్య ఆహారంగా మారుతుందని అంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment