Wednesday, May 7, 2014

"స్ప్రూస్ క్రీక్"...ఇక్కడ నివసిస్తున్నవారందరికీ ఒక విమానమున్నది.....ఫోటోలు

అమెరికాలో నార్త్ ఈస్ట్ ఫ్లొరిడా నగరములో స్ప్రూస్ క్రీక్ అనే పేరుతో ఒక గేటడ్ కాలనీ వున్నది. ఇక్కడ సుమారుగా 5000 అపార్ట్ మెంట్ లుగానీ/ ప్రజలుగానీ నివసిస్తున్నారు. వీరందరికీ ఒకొక్క విమానం ఉన్నది.

ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఫేమస్ రెసిడెంట్, హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టా. అయితే ఇతన్ని ఇక్కడి నుండి పంపించేరు. కారణం అతని విమానం బోయింగ్ 707 విపరీతమైన యొక్క విపరీతమైన మోత. అక్కడ నివసిస్తున్న ఇతరులకు ఆ విమాన మోత పడనందున అతన్ని అక్కడి నుండి కాలీ చేయించేరు. ఇదొక్కటే కారణం కాదు. అతని బోయింగ్ 707 విమానం ఆ కాలనీ లోని రన్వే కంటే పెద్దదిగా ఉండటమే.........ఈ కాలనీలో రకరకాల విమానాలు ఉన్నాయి.

రెండవ ప్రపంచ యుద్దం సమయములో అమెరికా ఎన్నో విమాన నిలయాలు మరియూ పైలట్లను అభివ్రుద్ది చేసింది. యుద్దం ముగిసిన తరువాత వీటిని ఎలాగైన వాడుకోవాలని చూసింది. కాని అది అంత పెద్దగా విజయవంతం కాలేదు. కానీ అరిజోనా, కాలరాడో,ఫ్లోరిడా, టెక్సాస్ మరియూ వాషింగ్టన్ లలో ఇలాంటి కాలనీలు ఉన్నాయి. కానీ ఇదే అతి పెద్దది.


No comments:

Post a Comment