Wednesday, May 7, 2014

రక్తం చిందించే చెట్టు....ఫోటోలు మరియూ వీడియో

సౌత్ ఆఫ్రికా లో పెరిగే ఈ చెట్టు పేరు మునింగా. బొటానికల్ పేరు Pterocarpus angolensis. దీనిని “బ్లడ్ వుడ్ ట్రీ” అని కూడా అంటారు. ఈ చెట్టును నరుకునప్పుడు లేక విరిగినప్పుడు, విరిగిన/నరికిన చోటు నుండి ఎర్రటి పసరు బయటకు వస్తుంది. ఒక జంతువును నరికినప్పుడు ఆ జంతువు నుండి నెత్తురు ప్రవాహం ఎలా ఉంటుందో ఈ చెట్టును నరికినప్పుడు అదేలాగా ఎర్రటి పసరు ప్రవహిస్తుందట.ఈ ఎర్రటి పసరు గాయాలను నయంచేస్తుందట. అక్కడ(సౌత్ ఆఫ్రికాలో) సాంప్రదాయకంగా ఈ ఎర్రటి పసరును రంగుగా ఉపయోగించుకుని ముఖమునకు వేసుకునే రంగులలో కలుపుతారట. ఆ ఎర్రటి పసరును ఎన్నో రకాల వ్యాధులకు మందుగా వాడతారట.


No comments:

Post a Comment